Page Loader
2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది
రెండు బైక్‌లలో ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి

2023 కవాసకి Z H2 v/s డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 11, 2023
06:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపనీస్ మార్క్ కవాసకి తన హైపర్‌బైక్ 2023 వెర్షన్, భారతదేశంలోని Z H2 ధరను రూ.23.02 లక్షలు. మార్కెట్లో ఇది సెగ్మెంట్ లీడర్, 2023 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4తో పోటీపడుతుంది. ఇది ట్రాక్-ఫోకస్డ్ నింజా H2R మోడల్‌కు వెర్షన్‌, Z H2 భారతదేశంలో స్ట్రీట్‌ఫైటర్ విభాగంలో కవాసకి MY-2023 అప్‌డేట్‌తో, హైపర్‌బైక్ ఇప్పుడు యూరో 5 BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉంది. కవాసకి Z H2 "సుగోమి" డిజైన్ ఫిలాసఫీతో వస్తుంది. 19-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, పెరిగిన హ్యాండిల్ బార్, స్ప్లిట్-స్టైల్ సీట్లు, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ తో వస్తుంది. డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 17-లీటర్ ఇంధన ట్యాంక్, కార్బన్ ఫైబర్ వింగ్‌లెట్‌లు, రైడర్-ఓన్లీ శాడిల్ తో వస్తుంది.

బైక్‌

రెండు బైక్‌లలో ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి

కవాసకి Z H2 998cc, సూపర్ఛార్జ్డ్, DOHC, ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ తో నడుస్తుంది, డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 1,103cc, లిక్విడ్-కూల్డ్, డెస్మోసెడిసి స్ట్రాడేల్, V4 ఇంజన్‌తో నడుస్తుంది. రైడర్ భద్రత కోసం కవాసకి Z H2, డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థొరెటల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. భారతదేశంలో, 2023 కవాసకి Z H2 మీకు రూ. 23.02 లక్షలు, 2023 డుకాటిస్ట్రీట్‌ఫైటర్ V4 రూ. 22.15 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). డుకాటి స్ట్రీట్‌ఫైటర్ V4 తక్కువ ధరతో శక్తివంతమైన V4 ఇంజిన్‌తో మెరుగైన ఎంపిక.