Page Loader
మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి
ఇందులో ESP, హిల్-హోల్డ్ కంట్రోల్‌ ఉన్నాయి

మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 15, 2023
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

2023 అప్‌డేట్‌లలో భాగంగా మారుతి సుజుకి తన ప్రసిద్ధ సెడాన్ మోడల్, సియాజ్ మూడు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్‌లను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ కంట్రోల్‌ కూడా ఉంది. 2014లో వచ్చినప్పటి నుండి, మారుతి సుజుకి సియాజ్ SUV విభాగంలో భారతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి మూడు లక్షల కార్లకు పైగా అమ్మగలిగింది. మారుతి సుజుకికు ప్రీమియం సెడాన్ సెగ్మెంట్‌లో దాదాపు 30% మార్కెట్ వాటా ఉంది. మారుతి సుజుకి సియాజ్ 1.5-లీటర్, K-సిరీస్, ఇన్‌లైన్-ఫోర్ పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది.

కార్

ఈ కారు లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి

మోటారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ అయింది. ఈ కారు లోపల, విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌, డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, స్టార్ట్/స్టాప్ బటన్‌తో కీ-లెస్ ఎంట్రీ, వెనుక AC వెంట్‌లతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి. భారతదేశంలో, మారుతి సుజుకి సియాజ్ బేస్ సిగ్మా మోడల్ ధర రూ. 9.19 లక్షలు, ఆల్ఫా డ్యూయల్-టోన్ AT వెర్షన్ ధర రూ.12.34 లక్షలు(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అప్డేట్ అయిన సెడాన్‌ను ఆన్‌లైన్‌లో లేదా NEXA డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.