Kia Seltos: 2026 కియా సెల్టోస్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి వివరాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ 'కియా సెల్టోస్' ఇప్పుడు కొత్త మోడల్‌తో అందుబాటులోకి వచ్చింది. 2026 కియా సెల్టోస్ని కియా ఇండియా అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, కియా ఈ కారును ఎనిమిది ప్రధాన ట్రిమ్స్‌లో లభించేలా రూపొందించింది. హెచ్టీఈ, హెచ్టీఈ (ఓ), హెచ్టీకే, హెచ్టీకే (ఓ), హెచ్టీఎక్స్, హెచ్టీఎక్స్ (ఏ), జీటీఎక్స్, జీటీఎక్స్ (ఏ). వీటిలో వేర్వేరు ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో కలిపి మొత్తం 34 వేరియంట్లు కస్టమర్ల కోసం సిద్ధంగా ఉన్నాయి.
Details
2026 కియా సెల్టోస్ ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
కారు మూడు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది 1.5-లీటర్ పెట్రోల్ (NA) : 115 హెచ్‌పీ పవర్, 144 ఎన్‌ఎం టార్క్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ : 160 హెచ్‌పీ పవర్, 253 ఎన్‌ఎం టార్క్ 1.5-లీటర్ డీజిల్ : 116 హెచ్‌పీ పవర్, 250 ఎన్‌ఎం టార్క్ గేర్ బాక్స్ ఆప్షన్లలో మ్యాన్యువల్ (MT), IVT, డ్యూయల్-క్లచ్ (DCT), ఆటోమేటిక్ (AT) ఉన్నాయి, కస్టమర్లు తాము కోరుకున్నది ఎంచుకోవచ్చు.
Details
వేరియంట్ల వారీగా ఫీచర్లు
హెచ్టీఈ (₹10.99 లక్షల నుంచి): ఎల్ఈడీ హెడ్‌లైట్లు, DRLs, 16-ఇంచ్ స్టీల్ వీల్స్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు. హెచ్టీఈ (ఓ) (₹12.09 లక్షల నుంచి): ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు. హెచ్టీకే (₹13.09 లక్షల నుంచి) : ఆటో-ఫోల్డ్ మిర్రర్లు, పుష్-బటన్ స్టార్ట్, స్మార్ట్ కీ, వెనుక సన్‌షేడ్స్, కొన్ని వేరియంట్లలో 17-ఇంచ్ అలాయ్ వీల్స్. హెచ్టీకే (ఓ) (₹14.19 లక్షల నుంచి) : పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్.
Details
వేరియంట్ల వారీగా ఫీచర్లు 1/2
హెచ్టీఎక్స్ (₹15.59 లక్షల నుంచి): యాంబియంట్ లైటింగ్, 12.3-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్, 8-స్పీకర్స్ బోస్ ఆడియో, గ్లోసీ బ్లాక్ గ్రిల్. హెచ్టీఎక్స్ (ఏ) (₹16.69 లక్షల నుంచి): లెవెల్ 2+ ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, 12.3-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే. జీటీఎక్స్, జీటీఎక్స్ (ఏ) (₹18.39 లక్షల నుంచి): టాప్-ఎండ్ ఆటోమేటిక్ వేరియంట్లు, మెమరీ సీట్లు, 18-ఇంచ్ పెద్ద వీల్స్, 21 రకాల ADAS ఫీచర్లు, అత్యంత సురక్షిత, విలాసవంతమైన ప్రయాణం.