LOADING...
2026 Renault Duster: భారత్‌లో 2026 రెనాల్ట్ డస్టర్ విడుదల.. ప్రారంభ ధర రూ.10.49 లక్షలు
భారత్‌లో 2026 రెనాల్ట్ డస్టర్ విడుదల.. ప్రారంభ ధర రూ.10.49 లక్షలు

2026 Renault Duster: భారత్‌లో 2026 రెనాల్ట్ డస్టర్ విడుదల.. ప్రారంభ ధర రూ.10.49 లక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లోకి రెనాల్ట్ మళ్లీ అడుగుపెట్టింది. 2026 డస్టర్‌ను రూ.10.49 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్‌షోరూమ్) భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న డస్టర్ మళ్లీ రావడంతో, దేశంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకోవాలని ఫ్రెంచ్ ఆటోమేకర్ భావిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలోనే మొదలయ్యే అవకాశముంది. 'ఆర్ పాస్' కస్టమర్లకు ఈ SUV రూ.10.29 లక్షల ప్రీ-బుకింగ్ ధరకు అందిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, కియా సెల్టోస్ వంటి ప్రముఖ మోడళ్లతో ఇది పోటీ పడనుంది. ఆధునిక అప్‌డేట్స్‌తో ఈ SUV మార్కెట్‌లో మంచి స్థానం సంపాదించే అవకాశముంది.

వివరాలు 

2026 రెనాల్ట్ డస్టర్: డిజైన్ 

డిజైన్ విషయానికి వస్తే, ఇండియా-స్పెక్ డస్టర్ అంతర్జాతీయ వెర్షన్‌తో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. అయితే,ప్రధాన సిల్హౌట్‌ను అలాగే ఉంచి,ముందుభాగంలో కొత్త లుక్ ఇచ్చారు. ముఖ్యంగా హెడ్‌ల్యాంప్స్‌కు కొత్త డిజైన్ ఇచ్చి, ఐబ్రో స్టైల్ DRLs‌ను అందించారు. ఇవే ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి.గ్రిల్ డిజైన్ కొత్తగా ఉండగా, బంపర్‌కు పిక్సెల్ స్టైల్ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో 18 అంగుళాల అలాయ్ వీల్స్, పుల్-స్టైల్ డోర్ హ్యాండిల్స్ కనిపిస్తాయి. వీల్ ఆర్చ్‌లపై ప్లాస్టిక్ క్లాడింగ్ కూడా ఇచ్చారు. రియర్ డోర్ హ్యాండిల్స్ C-పిల్లర్‌లో అమర్చారు.ఫంక్షనల్ రూఫ్ రైల్స్ కూడా అందించారు. వెనుక భాగంలో ట్రయాంగ్యులర్ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు మొత్తం టెయిల్‌గేట్ మీద LED లైట్ బార్ ఉంటుంది.

వివరాలు 

2026 రెనాల్ట్ డస్టర్: ఇంటీరియర్ 

సిల్వర్ ఇన్‌సర్ట్స్‌తో రియర్ బంపర్ SUVకి రగ్గ్డ్ లుక్ ఇస్తుంది. ఇండియన్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రీమియం కేబిన్‌తో డస్టర్ ఆకట్టుకుంటుంది. అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను అందించారు. డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో పాటు మూడు స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. కేబిన్‌లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, కాంట్రాస్టింగ్ స్టిచింగ్ ఉన్న అప్హోల్స్టరీ వాడారు. సెంటర్ కన్సోల్‌లో ప్రత్యేక బటన్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌తో పాటు స్టోరేజ్ సదుపాయం కూడా ఉంది.

Advertisement

వివరాలు 

2026 రెనాల్ట్ డస్టర్: ఫీచర్స్ 

కొత్త డస్టర్‌లో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో,ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉంటుంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,అంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆరు మార్గాల్లో అడ్జస్ట్ అయ్యే పవర్డ్ సీట్స్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు అందించారు. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABSతో పాటు EBD, ISOFIX చైల్డ్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా, లెవల్-2 ADAS ఫీచర్ కూడా అందించారు.

Advertisement

వివరాలు 

2026 రెనాల్ట్ డస్టర్: పవర్‌ట్రెయిన్

2026 డస్టర్‌లో పలు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో 1.8 లీటర్ ఫోర్ సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిపి E-Tech 160 హైబ్రిడ్ సిస్టమ్ అందించారు. ఇది 160 bhp పవర్, 172 Nmటార్క్‌ను ఇస్తుంది.ఇంకా 1.3లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (Turbo TCe 160) కూడా ఉంది. ఇది 160 bhp పవర్,280 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మాన్యువల్,డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ మోడల్‌లో 1.0లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 100 bhpపవర్,160 Nmటార్క్ ఇస్తుంది.ఈ వేరియంట్‌కు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Advertisement