LOADING...
Zelio Electric Scooter: సింగిల్ ఛార్జింగ్‌పై 90 కిలోమీటర్ల రేంజ్‌.. ఆకట్టుకుంటున్న జెలియో కొత్త ఈ-స్కూటర్లు!
సింగిల్ ఛార్జింగ్‌పై 90 కిలోమీటర్ల రేంజ్‌.. ఆకట్టుకుంటున్న జెలియో కొత్త ఈ-స్కూటర్లు!

Zelio Electric Scooter: సింగిల్ ఛార్జింగ్‌పై 90 కిలోమీటర్ల రేంజ్‌.. ఆకట్టుకుంటున్న జెలియో కొత్త ఈ-స్కూటర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ 'జెలియో ఆటో మొబైల్' తాజాగా మూడు కొత్త ఈ-స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈవా ఎకో ఎల్ఎక్స్, ఈవా ఎకో జెడ్‌ఎక్స్, ఈవాఎకో జెడ్‌ఎక్స్ ప్లస్ పేర్లతో ఈ మోడళ్లను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌, ఆధునిక ఫీచర్లు, తక్కువ ధర—ఈ మూడు అంశాలను సమపాళ్లలో కలిపి కంపెనీ ఈ స్కూటర్లను రూపకల్పన చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుంది. వీటికి రెండేళ్ల వారంటీ కూడా ఉంది. జెలియో సంస్థ ప్రకారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రయాణాలకు, రోజువారీ అవసరాలకు ఈ స్కూటర్లు అత్యంత అనువైనవి. తక్కువ స్పీడ్‌, తక్కువ ధరలో అందుబాటులో ఉండే విధంగా ఇవి రూపొందించబడ్డాయి.

Details

ఈవా ఎకో ఎల్ఎక్స్

ఈ మోడల్‌ ధర రూ. 51,551 (ఎక్స్-షోరూమ్). ఇది 48/60V BLDC మోటార్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌తో 60-90 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. ఇందులో జెల్‌ బ్యాటరీ లేదా లిథియం బ్యాటరీ ఎంపికలు ఉంటాయి. రెండు చక్రాలపై డ్రమ్‌ బ్రేక్‌లు, హైడ్రాలిక్‌ సస్పెన్షన్‌, అలాగే 36 లీటర్ల బూట్‌ స్పేస్‌ ఉన్నాయి. నలుపు, బూడిద, ఎరుపు, నీలం — నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ఈ మోడల్‌ ధర రూ. 53,551 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఎల్ఎక్స్ మోడల్‌తో పోలిస్తే కొంచెం స్పోర్టీగా ఉంటుంది. పెద్ద టైర్లు, గ్లోసీ వైట్‌ ఫినిషింగ్‌ కలర్‌ వేరియంట్‌తో వస్తుంది. ఇదీ జెల్‌, లిథియం బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది.

Details

ఈవా ఎకో జెడ్‌ఎక్స్ ప్లస్ 

ఈ మోడల్‌ కొత్త డిజైన్‌తో పాటు మరింత శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. ధర రూ.65,051 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది 60V, 72V మోటార్‌ ఎంపికలు, అలాగే GEL, లిథియం బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లు కలిగి ఉంది. భద్రత కోసం ముందు డిస్క్‌ బ్రేక్, వెనుక డ్రమ్‌ బ్రేక్, అలాగే 90-90/12 సైజ్‌ టైర్లు అమర్చారు.

Details

ఆధునిక ఫీచర్లు

ఈ మూడు మోడళ్లలో కూడా డిజిటల్‌ డిస్‌ప్లే, కీలెస్‌ స్టార్ట్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, ఫైండ్‌-మీ ఫీచర్‌, ఇమ్మొబిలైజర్‌ సిస్టమ్‌, సెంటర్‌ లాక్‌, యాంటీ-థెఫ్ట్‌ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్‌, పూర్తి LED లైటింగ్‌ వంటి అనేక స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. జెలియో అన్ని మోడళ్లకు రెండేళ్ల వారంటీని అందిస్తోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఇవి ఉత్తమ ఎంపికగా మారనున్నాయని కంపెనీ పేర్కొంది. హర్యానాలో 2021లో ప్రారంభమైన జెలియో, ప్రస్తుతం ఏడాదికి 72,000 స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో 280 పైగా డీలర్‌షిప్‌లు కలిగి ఉంది. ప్రస్తుతం కొత్త మోడళ్ల బుకింగ్‌లు దేశవ్యాప్తంగా జెలియో షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి.