Page Loader
Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది
రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో వస్తాయి

Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 20, 2023
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లో భాగమైన Ampere ఎలక్ట్రిక్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Primus ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ లో Ola S1తో ఇది పోటీ పడుతుంది. ఈమధ్య కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ బాగా పెరిగింది. స్వదేశీ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు Ampere, అధిక-స్పీడ్ ఈ-స్కూటర్‌లను సామాన్యులకు అనుకూలమైన ధరకే అందించడం ద్వారా మిగిలిన వాటి కంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తుంది. Primusలో ఇండికేటర్-మౌంటెడ్ ఫ్రంట్ ఆప్రాన్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, సింగిల్-పీస్ గ్రాబ్ రైల్, టాపర్డ్ టెయిల్ సెక్షన్, LED టెయిల్‌లాంప్‌ ఉంటాయి. Ola S1లో డ్యూయల్-పాడ్ LED హెడ్‌లైట్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, సింగిల్-పీస్ సీట్, స్ప్లిట్-టైప్ గ్రాబ్ రైల్స్, వైడ్ బాడీ ప్యానెల్‌లు ఉంటుంది.

స్కూటర్

రెండింటిలో Ola S1 మెరుగైన ఆప్షన్

Primusకి IP67-రేటెడ్ 4kW PMS ఎలక్ట్రిక్ మోటార్ సపోర్ట్ ఉంది, ఇది 3kWh లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీతో కనెక్ట్ అయ్యి ఉంది. Ola S1 3kWh బ్యాటరీ ప్యాక్‌ తో కనెక్ట్ అయిన 8.5kW ఎలక్ట్రిక్ మోటార్ తో నడుస్తుంది. Primus ఒక్కసారి ఛార్జింగ్‌తో 100కిలోమీటర్లు, S1 141కిమీల వరకు నడుస్తాయి. రైడర్ భద్రత కోసం Primusలో డ్రమ్ బ్రేక్‌లు, Ola S1లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. భారతదేశంలో, Ampere Primus ధర రూ.1.09 లక్షలు, Ola S1 ధర దాదాపు. 1 లక్ష అయితే Ola S1 ఫ్యూచరిస్టిక్ లుక్ తో, CBSతో, డిస్క్ బ్రేక్‌లతో, తక్కువ ధరతో Ampere Primus కంటే మెరుగైన ఆప్షన్.