LOADING...
Global Crude Prices: పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించాలా? ఇలా చేయండి
పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించాలా? ఇలా చేయండి

Global Crude Prices: పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గించాలా? ఇలా చేయండి

వ్రాసిన వారు Moogati Shabari
Mar 16, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో గ్లోబల్ క్రూడ్ సరఫరా తగ్గింది. దీంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగి ఇంధన ధరలు కూడా ఎగబాకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాహనదారులు కొన్ని స్మార్ట్ అలవాట్లు పాటిస్తే, ఒక లీటర్ పెట్రోల్ లేదా డీజిల్‌తో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

వివరాలు

స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయండి

ఆధునిక వాహనాలు సాధారణంగా హైవేలపై స్థిరమైన వేగంతో నడిపినప్పుడు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. చాలా వేగంగా డ్రైవ్ చేస్తే ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది.గాలి తీవ్రత కూడా ఎక్కువ అవుతుంది. దీని వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. కాబట్టి హైవేలపై డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకే వేగాన్ని కొనసాగించడం మంచిది. వాహనంలో క్రూయిజ్ కంట్రోల్ సదుపాయం ఉంటే దాన్ని ఉపయోగించడం ద్వారా వేగాన్ని స్థిరంగా ఉంచి అనవసరంగా వేగం పెంచడం, తగ్గించడం లాంటివి చేయొచ్చు.

వివరాలు

సడెన్ బ్రేక్ వేయడం మానండి

వాహనాన్ని ఒక్కసారిగా వేగంగా నడపడం లేదా ఆకస్మికంగా బ్రేక్ వేయడం వంటి అలవాట్లు ఇంధన వినియోగాన్ని పెంచుతాయి. క్రమంగా వేగం పెంచుతూ డ్రైవ్ చేస్తే ఇంజిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ముందున్న ట్రాఫిక్ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి డ్రైవ్ చేస్తే, సిగ్నల్ దగ్గర లేదా నెమ్మదిగా వెళ్తున్న వాహనాల వద్ద అనవసరంగా వేగం పెంచి బ్రేక్ వేయాల్సిన పరిస్థితి తగ్గుతుంది. దీంతో ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చు.

Advertisement