Page Loader
జనవరి 26న రాబోతున్న  Audi యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్
జనవరి 26న సరికొత్త యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్ కారు విడుదల

జనవరి 26న రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 23, 2023
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi జనవరి 26న సరికొత్త యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్ కారును విడుదల చేయనుంది. "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో భాగంగా ప్రదర్శించబడుతుంది. ఇది గ్రాండ్‌స్పియర్, అర్బన్‌స్పియర్ మోడల్‌ లాగానే PPE ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Audi Q8 ఇ-ట్రాన్ (గతంలో ఇ-ట్రాన్) రూపంలో బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ని ప్రవేశపెట్టింది. ప్రత్యామ్నాయంగా, బ్రాండ్ 'స్పియర్' సిరీస్ కూడా అభివృద్ధి చేస్తోంది, ఇందులో స్కైస్పియర్, గ్రాండ్‌స్పియర్, అర్బన్‌స్పియర్ కాన్సెప్ట్‌లు ఉన్నాయి.ఇప్పుడు, కంపెనీ సరికొత్త యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌ను పరిచయం చేయనుంది. Audi యాక్టివ్‌స్పియర్ లో డిజైన్ చేసిన హుడ్, ఆడి లోగో, ఒక రేక్డ్ విండ్‌స్క్రీన్, వాలుగా ఉండే రూఫ్‌లైన్ తో పాటు LED హెడ్‌లైట్‌లు ఉంటాయి.

కార్

ఇంకా ప్రారంభ కాన్సెప్ట్ దశలోనే ఉన్న Audi యాక్టివ్‌స్పియర్

యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌కి సంబంధించిన సాంకేతిక వివరాలను Audi ఇంకా వెల్లడించలేదు. ఇది IP-రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ మోటారు ద్వారా నడుస్తుంది. లోపల మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌తో ఉండే విశాలమైన క్యాబిన్, గాజు పైకప్పు, వెనుక AC వెంట్‌లతో ఉన్నమల్టీజోన్ క్లైమేట్ కంట్రోల్, యోక్-టైప్ స్టీరింగ్ వీల్ తో పాటు పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు , ADAS ఫంక్షన్‌ ఇందులో ఉంటుంది. Audi యాక్టివ్‌స్పియర్ ఇంకా ప్రారంభ కాన్సెప్ట్ దశలో ఉంది అందుకే ధర వివరాలు ఇంకా తెలియలేదు. వాహన తయారీసంస్థ రాబోయే సంవత్సరంలో తుది ఉత్పత్తి ప్రదర్శించే అవకాశం ఉంది.