తదుపరి వార్తా కథనం

Audi India: ఆడి కార్లపై రెండు శాతం వరకు ధరల పెంపు.. ఎప్పటినుంచంటే?
వ్రాసిన వారు
Sirish Praharaju
May 02, 2025
01:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఆడి (Audi India) భారత్‌లో తమ వాహనాల ధరలను త్వరలో పెంచబోతోంది.
దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లపై గరిష్ఠంగా 2 శాతం వరకూ ధరలు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ పెంపు మే 15వ తేదీ నుండి అమలులోకి రానుందని స్పష్టం చేసింది. నిర్వహణకు సంబంధించిన ఖర్చులు పెరిగిన నేపథ్యంలోనే ధరలు సవరించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆడి శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఆడి సంస్థ ఏ4, క్యూ5, క్యూ7, ఆర్‌ఎస్ ఇ-ట్రాన్ జీటీ వంటి అనేక ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మే 15 నుంచి ఆడి వాహనాల ధరలను 2% వరకు పెరగనున్నాయి
Audi to hike vehicle prices by up to 2% from May 15https://t.co/DbCr93LMAs#Audi #AudiIndia #CarSales #PriceHike @AudiIN pic.twitter.com/ftnESPOITC
— NewsDrum (@thenewsdrum) May 2, 2025