Audi:టైటానియం లుక్‌తో మెరిసిన ఆడి R26 కాన్సెప్ట్..కొత్త యుగానికి నాంది
ఈ వార్తాకథనం ఏంటి
ఆడి తన మొదటి ఫార్ములా-1 కారు "ఆడి R26 కాన్సెప్ట్"ను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ వాహనం ఆడి బ్రాండ్‌కు కొత్త గుర్తింపుగా నిలుస్తూ, టైటానియం, కార్బన్ బ్లాక్, అలాగే కొత్త షేడ్లో ఆడి రెడ్ రంగుతో ఆకట్టుకుంటోంది. రెడ్ కలర్ రింగ్స్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపించే ఈ కారు, సంస్థకు కొత్త రూపానికి దారితీసే "పయనీర్"గా భావిస్తున్నారు.
వ్యూహాత్మక ఎత్తుగడ
ఆడి ఫార్ములా 1 ప్రయాణం.. కీలక వ్యక్తులు
ఆడి తన ఫార్ములా-1 ప్రయాణాన్ని 2022లో సౌబర్ గ్రూప్‌ను కొనుగోలు చేయడంతో ప్రారంభించింది. అప్పటి నుండి సంస్థ 1.6 లీటర్ టర్బోచార్జ్డ్ V6 ఇంజిన్, ఎనర్జీ రికవరీ సిస్టమ్, అలాగే ట్రాన్స్‌మిషన్ వంటి పవర్ యూనిట్ భాగాల అభివృద్ధిపై పని చేస్తోంది. టీమ్ లీడర్‌షిప్‌లో మాజీ ఫెరారీ టీమ్ ప్రిన్సిపల్ మత్తియా బినోట్టో, అలాగే మాజీ రెడ్ బుల్ స్పోర్టింగ్ డైరెక్టర్ జోనథన్ వీట్‌లీ ఉన్నారు.
రాబోయే ఈవెంట్‌లు
టెస్టింగ్, రేసింగ్ షెడ్యూల్
ఆడి ఫార్ములా-1 కారు వచ్చే ఫిబ్రవరిలో బహ్రెయిన్‌లో జరగబోయే టెస్టింగ్‌లో తొలిసారి ట్రాక్‌పైకి దిగనుంది. అసలైన రేసింగ్ డెబ్యూ మాత్రం మార్చిలో ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ (మెల్‌బోర్న్)లో జరగనుంది. గట్టి పోటీ వాతావరణంలో అడుగుపెడుతున్నప్పటికీ, ఆడి ఈ దశాబ్దం చివరినాటికి బలమైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భవిష్యత్తు ప్రణాళికలు
ఆడి దీర్ఘకాల ఫార్ములా-1 లక్ష్యాలు
ఆడి సీఈఓ గెర్నాట్ డాల్నర్ ఫార్ములా-1లో కంపెనీ దీర్ఘకాల ఆశయాలను స్పష్టంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "మేము కేవలం పాల్గొనడానికే కాదు, గెలవడానికే వస్తున్నాం" అన్నారు. అయితే ఈ క్రీడలో అగ్రస్థానానికి చేరుకోవడం సమయం, సహనం, నిరంతర మెరుగుదల అవసరమని ఆయన గుర్తు చేశారు. 2030 నాటికి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీ చేసే స్థాయికి చేరుకోవడమే ఆడి ప్రధాన లక్ష్యం.