LOADING...
Bajaj Platina: తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్.. మార్కెట్లో దూసుకెళ్తున్న బజాజ్ ప్లాటినా!
తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్.. మార్కెట్లో దూసుకెళ్తున్న బజాజ్ ప్లాటినా!

Bajaj Platina: తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్.. మార్కెట్లో దూసుకెళ్తున్న బజాజ్ ప్లాటినా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో మిడ్‌ల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ-వీలర్లు వైపు ఆకర్షితులవుతుంటారు. వారు తక్కువ ధరలో, సింపుల్ ఫీచర్లతో కూడిన బైక్‌లను ప్రధానంగా ఎంచుకుంటారు. ఈ కేటగిరీలో 'బజాజ్ ప్లాటినా' ప్రత్యేక స్థానం పొందింది. బజాజ్ తాజాగా ప్లాటినా బైక్‌ను రెండు వేరియెంట్లలో విడుదల చేసింది. ప్లాటినా 100, ప్లాటినా 100 డ్రమ్. కంపెనీ ప్రకారం, ప్లాటినా 100 ధర రూ. 65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర రూ. 69,284. ఈ బైక్‌లు ప్రస్తుత మార్కెట్‌లో అత్యంత 'అఫోర్డబుల్' వర్గానికి చెందినవిగా నిలుస్తాయి. ప్లాటినా 100లో 102cc DTS-i సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజిన్ అమర్చారు. తక్కువ పెట్రోల్‌లో ఎక్కువ మైలేజ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేశారు.

Details

లాంగ్ ట్రిప్ కోసం 'ప్లాటినా 100 డ్రమ్'

ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లతో, ఫుల్ ట్యాంక్‌లో సుమారు 700-800 కిలోమీటర్లు నడవగలదని యాజమాన్యం తెలిపింది. మరొకవైపు ప్లాటినా 100 డ్రమ్ 115.45cc ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. అధునాతన FI టెక్నాలజీ కారణంగా థ్రాటిల్ రెస్పాన్స్ మెరుగ్గా, ఎత్తైన ప్రాంతాల్లోనూ సౌకర్యవంతంగా నడవగల సామర్థ్యం కలిగి ఉంది. తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి ప్లాటినా 100 అద్భుతమైన ఎంపికగా ఉంటే లాంగ్ ట్రిప్స్ కోసం 'ప్లాటినా 100 డ్రమ్' మరింత శక్తివంతమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయమని చెప్పొచ్చు.

Advertisement