భారతదేశంలో విడుదలైన Bentley Bentayga EWB Azure, పూర్తి వివరాలు తెలుసుకుందాం
లగ్జరీ కార్ల తయారీ సంస్థ Bentley భారతదేశంలో Bentayga EWB Azure మోడల్‌ను విడుదల చేసింది. అల్ట్రా-విలాసవంతమైన ఈ Azure వేరియంట్‌లో వెనుక ఎయిర్‌లైన్ సీట్లు, ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజింగ్ డోర్లు, మొత్తం ఫ్లోర్‌ను కవర్ చేసే 'డీప్ పైల్ ఓవర్' మ్యాట్‌లు, ప్రీమియం నైమ్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ SUV 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, V8 పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. 2015లో ప్రవేశపెట్టిన Bentayga Bentley మోడల్స్ లో అధికంగా అమ్ముడైన మోడల్. వోక్స్‌వ్యాగన్ గ్రూప్ MLB Evo ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, అల్ట్రా-లగ్జరీ SUV సౌకర్యవంతమైన రైడ్ అందిస్తుంది.
మార్కెట్ లో రోల్స్ రాయిస్ కల్లినన్ కు పోటీ
లోపల విలాసవంతమైన డ్యాష్‌బోర్డ్ తో, సెంట్రల్ కన్సోల్‌పై నాలుగు/ఐదు-సీట్ల క్యాబిన్, ప్రీమియం హ్యాండ్-స్టిచ్డ్ లెదర్ అప్హోల్స్టరీ, వెనుకవైపు 'ఎయిర్‌లైన్ సీట్లు', పనోరమిక్ సన్‌రూఫ్, నైమ్ సౌండ్ సిస్టమ్, 10.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ల ఇందులో ఉంటుంది. రేంజ్-టాపింగ్ Bentley Bentayga EWB Azure మీకు రూ.6 కోట్లు భారతదేశంలో (ఎక్స్-షోరూమ్). ఈ SUV బ్రాండ్ "Bespoke" ప్రోగ్రామ్ క్రింద వివిధ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లో లగ్జరీ SUV కేటగిరీలో రోల్స్ రాయిస్ కల్లినన్‌కు పోటీగా ఉంటుంది.