Loading...
Bharat Mobility Global Expo 2027: ఢిల్లీ వేదికగా భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో
ఢిల్లీ వేదికగా భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో

Bharat Mobility Global Expo 2027: ఢిల్లీ వేదికగా భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2027కు తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు దేశ రాజధాని దిల్లీలో ఈ మెగా ఆటో మొబైల్‌ ఈవెంట్‌ జరగనుంది. 'స్మార్ట్‌ మొబిలిటీ ఫర్‌ ఎ బెటర్‌ టుమారో' అనే థీమ్‌తో నిర్వహించే ఈ ప్రదర్శనలో కార్లు, ద్విచక్ర వాహనాలు, విడిభాగాలు, బ్యాటరీలు, మొబిలిటీ టెక్నాలజీతో పాటు భవిష్యత్‌ రవాణాకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు కనిపించనున్నాయి.

Details

రెండు వేదికల్లో ఆటో సందడి

ఈసారి ఎక్స్‌పోను దిల్లీలోని భారత్‌ మండపం, యశోభూమి వేదికలపై నిర్వహిస్తున్నారు.

భారత్‌ మండపంలో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు, యశోభూమిలో ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయి.

మొత్తం 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఎక్స్‌పోకు 10 లక్షలకు పైగా సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Details

50కి పైగా దేశాల నుంచి సంస్థలు

ఈసారి భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో అంతర్జాతీయ స్థాయిలోనూ పెద్ద ఆకర్షణగా మారనుంది.

50కి పైగా దేశాల నుంచి 1,750 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారు.

అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, మెక్సికో, తైవాన్‌, శ్రీలంక వంటి దేశాల సంస్థలు ఇందులో భాగం కానున్నాయి.

ADVERTISEMENT

Details

44 కంపెనీలతో 'ది మోటార్‌ షో'

ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా నిలిచేది 'ది మోటార్‌ షో 2027'. ఇందులో కనీసం 44 ప్రముఖ వాహన తయారీ సంస్థలు పాల్గొంటున్నాయి.

వీటి కోసం ఏకంగా 79,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలతో పాటు సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, ఇథనాల్‌, ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌, హైడ్రోజన్‌ వంటి విభిన్న పవర్‌ట్రెయిన్‌ టెక్నాలజీలతో కొత్త మోడళ్లు పరిచయం కానున్నాయి.

ADVERTISEMENT

Details

ఒకే చోట 11 ప్రత్యేక ప్రదర్శనలు

ఇది కేవలం కార్లు, బైక్‌ల ప్రదర్శన మాత్రమే కాదు. ఒకేసారి 11 ప్రత్యేక ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు.

మోటార్‌ షోతో పాటు టైర్లు, బ్యాటరీలు, సైకిళ్లు, మొబిలిటీ టెక్నాలజీ, ఆటో కాంపోనెంట్స్‌, అడ్వాన్స్‌డ్‌ మెటీరియల్స్‌, కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌, అగ్రి మొబిలిటీ, ఎయిర్‌ మొబిలిటీ, మెట్రో-అర్బన్‌ ట్రాన్సిట్‌ వంటి విభాగాలు ఇందులో ఉంటాయి.

Details

భవిష్యత్‌ మొబిలిటీకి ఢిల్లీ వేదిక

ఒకే ప్రాంగణంలో ఇన్ని విభాగాలు కలవడంతో భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2027 ఆటో పరిశ్రమలో రాబోయే మార్పులను దగ్గరగా చూపించే వేదికగా నిలవనుంది.

కొత్త వాహనాల కంటే వాటి వెనుక ఉన్న టెక్నాలజీ, ప్రత్యామ్నాయ ఇంధనాలు, బ్యాటరీలు, స్మార్ట్‌ మొబిలిటీ పరిష్కారాలపైనే ఈసారి ఎక్కువ ఆసక్తి కనిపించనుంది.

ఫిబ్రవరిలో దిల్లీ ఆటోమొబైల్‌ పరిశ్రమకు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.

ADVERTISEMENT