BMW M3 CS: 2025లో రానున్న శక్తివంతమైన బీఎండబ్ల్యూ, ధర ఎంతో తెలుసా
BMW M3 కొత్త వెర్షన్ M3 CS తయారీ కోసం లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కారు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ నయా మోడల్ ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2025లో వెల్లువెత్తనుంది. ఈ అధిక-ఆక్టేన్ వ్యాగన్ ఇప్పటికే ఉత్పత్తి కోసం సన్నహాలు చేస్తోంది. ప్రామాణికంగా M3 అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. M3 CS 3.0-లీటర్, S58, ట్విన్-టర్బో ఇన్‌లైన్-సిక్స్ శక్తివంతమైన ఇంజిన్‌ను ప్యాక్ చేస్తుంది. ఇది 543hp శక్తిని, 649.4Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. రానున్న M3 CS కొత్తగా రూపొందించిన బ్యాక్ డిఫ్యూజర్, బ్యాక్ స్పాయిలర్‌పై కార్బన్ ఫైబర్ టచ్‌లను కలిగి ఉంటుందని సమాచారం.
భారత్ వస్తుందో లేదో స్పష్టత లేదు
ఈ అప్‌గ్రేడ్‌లు M3 కాంపిటీషన్ xDriveతో పోల్చితే, M3 CS సెడాన్‌లో కనిపించే 34kg డ్రాప్ మాదిరిగానే కొంచెం బరువును తగ్గించడంలో సహకరించనున్నాయి. ఈ అధిక-పనితీరు గల వ్యాగన్ ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది, దాని 3.0-లీటర్ ఇంజన్ నుండి నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది. M3 CS పరిమిత పరిమాణంలో ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.ప్రపంచ ఉత్పత్తి కోసం 2,000 కంటే తక్కువ యూనిట్లు ఉన్నాయి. అమెరికాలో ఈ కారును విక్రయించే అవకాశం లేదు. అయినప్పటికీ అక్కడి కొనుగోలుదారులు M3 CS సెడాన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర మాత్రం 118,700 డాలర్లు (రూ. 99 లక్షలు) ఉండొచ్చు. కానీ ఈ లగర్జీ వాహనం భారత్ వస్తుందో లేదో స్పష్టత లేదు.