బీఎండబ్ల్యూ కొత్త కారు లాంచ్.. ధర ఎంతంటే!
యూరప్ లగ్జరీ ఆటో కంపెనీ బీఎండబ్య్లూ ఇండియా మార్కెట్లోకి సరికొత్త కారును లాంచ్ చేసింది. ఎక్స్ 3 ఎం40ఐ పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ మోడల్, ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఎక్స్ 3 మోడల్ ను 2003లో తొలిసారిగా బీఎండబ్య్లూ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఎస్‌యూవీకి మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఎస్‌యూవీ మోడల్ కు అనేక సంస్థల గట్టి పోటీ ఎదురవుతోంది. పోటికి తగ్గట్టుగానే కొత్తగా ఎక్స్ 3 ఎం40ఐని లాంచ్ ను ప్రవేశపెట్టింది.ఇందులో స్కల్ప్టెడ్ హుడ్, సీ- షేప్ డీఆర్ఎల్స్తో కూడిన స్వెప్ట్‌బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, వ్రాప్- అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, 20 ఇంచ్ ఎం లైట్ డిజైనర్ వీల్స్ ప్రత్యేకంగా రూపొందించారు
ఐదు సెకన్లలోపు 0-100 కేఎంపీహెచ్ స్పీడ్
ఈ వెహికల్ ఎక్స్ షోరూం ధర రూ.86.50 లక్షలు ఉండనుంది. గరిష్టంగా 360 హెచ్‌పీని, 500 ఎన్ఎం గరిష్ట టార్క్ ను విడుదల చేస్తోంది. కేవలం ఐదు సెకన్లలోపు 0-100 కేఎంపీహెచ్ స్పీడ్‌ను అందుకోవడం దీని ప్రత్యేకత. ఎక్స్3 ఎం ఎడిషన్ గరిష్టంగా 250 కేఎంపీహెచ్ వేగంతో ప్రయాణించనుంది. ముఖ్యంగా ఫ్యాసింజర్ భద్రత కోసం మల్టిఫుల్ ఎయిర్ బ్యాగ్స్, ఏడీఏఎస్ ఫంక్షన్స్ రానున్నాయి. 8 స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్ ఇందులో ఉండనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. బీఎండబ్ల్యూ ఆన్ లైన్ షాప్ లో దీన్ని బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది.