Page Loader
ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!
ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!

ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2023
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కొత్త కార్ కొనాలని ఎంతోమంది చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వాహన సంస్థలు ఎన్నో కొత్త మోడళ్లు తీసుకొస్తుంటాయి. మరోవైపు బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తూ కొనుగోలుదారులను ప్రోత్సహిస్తుంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో బడ్జెట్, రుణ అర్హత, బీమా రేట్లు, ఇంధన ఎంపికలు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. కారును కొనుగోలు చేయడానికి ముందు బడ్జెట్‌ను అంచనా వేసుకొని, దానికి తగ్గట్టు లోన్‌ను తీసుకోవడం మంచిది. కారు లోన్‌పై ఓ నిర్ణయానికి వస్తే బ్యాంక్ ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ వ్యవధిని, 100శాతం వరకు ఫైనాన్సింగ్‌ను అందిజేస్తుందని తెలుసుకోవాలి.

Details

అవసరమైనంత వరకే రుణాన్ని తీసుకోవడం మంచిది

కారు లోన్‌ను ఎంచుకోవడం వల్ల వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు, GST కారణంగా కారు వాస్తవ ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరైన బీమా పాలసీని ఎంచుకోవాలి. పెట్రోల్, డీజిల్, CNG లేదా ఎలక్ట్రిక్ ఇంధన రకాన్ని ఎంచుకోవడం మీ కారు నిర్వహణ ఖర్చులను ప్రభావితం చేస్తాయి. మీ కొత్త వాహనం తయారీదారుల వారంటీతో వస్తుందని నిర్ధారించుకోండి. కారుపై పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఇప్పుడు చాలా బ్యాంకులు కారు ఆన్‌రోడ్‌ ధరలో 100 శాతం రుణాన్ని అందిస్తున్నాయి. మీకు అవసరమైనంత మేరకే రుణాన్ని తీసుకోవడం మంచిది. అప్పుడే వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంటుంది.