NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / జూలైలో కార్ల అమ్మకాలు క్షీణించాయి.. టాప్ 5 కంపెనీల అమ్మకాల గురించి తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    జూలైలో కార్ల అమ్మకాలు క్షీణించాయి.. టాప్ 5 కంపెనీల అమ్మకాల గురించి తెలుసుకోండి
    జూలైలో కార్ల అమ్మకాలు క్షీణించాయి.. టాప్ 5 కంపెనీల అమ్మకాల గురించి తెలుసుకోండి

    జూలైలో కార్ల అమ్మకాలు క్షీణించాయి.. టాప్ 5 కంపెనీల అమ్మకాల గురించి తెలుసుకోండి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 03, 2024
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కార్ల తయారీ కంపెనీలు జూలై నెలా అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి.

    అమ్మకాల నివేదిక ప్రకారం , గత నెలలో కార్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

    దేశంలోని టాప్ 7 కంపెనీల ఉమ్మడి అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 1 శాతం తగ్గి రూ.3.11 లక్షలకు చేరుకున్నాయి.

    మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

    వచ్చే పండుగ సీజన్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు తెలిపాయి.

    జూలైలో టాప్-5 కంపెనీల విక్రయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

    Details

    అమ్మకాల్లో మారుతీ సుజుకీ ముందంజ

    జూలైలో అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ ముందుంది. అయితే, గత నెలలో వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు 9.64 శాతం క్షీణించాయి.

    గతేడాది జూలైలో కంపెనీ దేశీయ మార్కెట్లో 1.52 లక్షల వాహనాలను విక్రయించగా, గత నెలలో 1.37 లక్షలకు మేర తగ్గింది.

    చిన్న కార్ల అమ్మకాలు గతేడాది 9,590 నుండి 9,960కి పెరిగాయి,

    Details

    విక్రయాల పరంగా రెండో స్థానంలో హ్యుందాయ్

    హ్యుందాయ్ మోటార్ కంపెనీ గత నెలలో 49,013 వాహనాలను విక్రయించింది. దీంతో విక్రయాల పరంగా రెండవ స్థానంలో ఉంది .

    గతేడాది ఇదే నెలలో విక్రయించిన 50,701 కార్లతో పోలిస్తే ఈ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 3 శాతం తక్కువే అని చెప్పచ్చు.

    కొత్త హ్యుందాయ్ క్రెటా కొరియన్ కార్ల తయారీ సంస్థతో అమ్మకాలలో అత్యధిక వాటాను కలిగి ఉంది.

    జూలైలో ఇప్పటివరకు దాని అత్యధిక నెలవారీ అమ్మకాలు 17,350 కాగా, ఇది మొత్తం అమ్మకాలలో 35 శాతం వాటాను పొందింది.

    Details

    టాటా మోటార్స్ విక్రయాలు తగ్గుముఖం

    టాటా కార్ల విక్రయాలు 6 శాతం క్షీణించాయి.

    జూలైలో, టాటా మోటార్స్ దేశీయ మార్కెట్ విక్రయాలు గత ఏడాది 47,628 వాహనాల నుంచి 6 శాతం క్షీణించి 44,725 వాహనాలకు పడిపోయాయి.

    అందువల్ల ఇది మూడవ స్థానంలో నిలిచింది.

    టాటా మోటార్స్ వాహనాల మొత్తం అమ్మకాలు (దేశీయ మరియు ఎగుమతులు) జూలై 2023లో 80,633 నుండి 10.7 శాతం క్షీణించి 71,996కి పడిపోయాయి.

    Details

    మహీంద్రా అండ్ మహీంద్రా 40వేల మార్కును అధిగమించింది

    మహీంద్రా అండ్ మహీంద్రా గత నెలలో 41,623 అమ్మకాలను నమోదు చేసి నాలుగో స్థానంలో నిలిచింది.

    జూలై 2023లో 36,205 అమ్మకాలతో పోలిస్తే ఈ సంఖ్య వార్షిక ప్రాతిపదికన 15 శాతం ఎక్కువ.

    వరుసగా ఏడో నెల విక్రయాల్లో 40,000 మార్కును అధిగమించింది.

    FY 2025 మొదటి 4 నెలల్లో (ఏప్రిల్-జూలై) 1.67 లక్షల అమ్మకాలు జరిగాయి, ఇది వార్షిక ప్రాతిపదికన 22 శాతం ఎక్కువ.

    Details

    విక్రయాల్లో టయోటా ఐదో స్థానం

    టయోటా విక్రయాల్లో ఐదవ స్థానంలో ఉంది. టయోటా జూలైలో 29,533 వాహనాలను విక్రయించి, ఈ ఏడాది అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను సాధించింది.

    ఇది గతేడాది విక్రయించిన 21,911 వాహనాల కంటే 44 శాతం ఎక్కువ.

    FY2025 మొదటి 4 నెలల్లో మొత్తం అమ్మకాలు 97,874 వద్ద ఉన్నాయి.

    ఇది గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన అమ్మకాల కంటే 36 శాతం ఎక్కువ.

    జూలై నెలలో కియా మోటార్స్ 20,507 మరియు హోండా 4,624 అమ్మకాలను నమోదు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మారుతీ సుజుకీ
    హ్యుందాయ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    మారుతీ సుజుకీ

    Maruthi: భారీ ప్రణాళికతో ముందుకొచ్చిన మారుతీ.. ఏకంగా 45వేల కోట్ల పెట్టుబడులు! వ్యాపారం
    Top Selling Cars August: 2023 అగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..! ఆటో మొబైల్
    Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే? ఆటో మొబైల్

    హ్యుందాయ్

    జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే! ఆటో మొబైల్
    భారతీయ వాహన మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌.. రూ.6 లక్షలకే కారు కార్
    హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు! ఆటో మొబైల్
    క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025