
Xiaomi YU7: గంటలోనే దాదాపు 3 లక్షల ఆర్డర్స్.. షావోమీ కొత్త ఈవీ YU7
ఈ వార్తాకథనం ఏంటి
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షావోమీ ఇటీవల ఆ దేశ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన విద్యుత్ కారు విపరీతమైన స్పందనను అందుకుంది. Xiaomi YU7 పేరుతో విడుదలైన ఈ కారుకు ప్రారంభ గంటలోనే 2.89 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఈ అభూతపూర్వ స్పందన నేపథ్యంలో కంపెనీ షేర్ల ధరలు సగటున 8 శాతం పెరిగాయి. అంతేగాక,ప్రముఖ కంపెనీ టెస్లాకి షావోమీ రూపంలో మరో గట్టి పోటీ ఎదురవుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. స్మార్ట్‌ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో మంచి గుర్తింపు పొందిన షావోమీ, గత సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ వాహన రంగంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2023 మార్చిలో సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 పేరుతో విడుదల చేసింది.
వివరాలు
YU7 దాదాపు 4 శాతం తక్కువ ధరకు
ఇప్పుడు రెండవ కారుగా YU7ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధరను 253,500 యువాన్లు (అంటే సుమారుగా 35 వేల అమెరికన్ డాలర్లు)గా ప్రకటించింది. ఈ కారు మూడు వేరియంట్లలో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన టెస్లా మోడల్ వైతో పోలిస్తే, షావోమీ YU7 దాదాపు 4 శాతం తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులోని టాప్ వేరియంట్‌లో 96.3 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీని ద్వారా ఒకే చార్జింగ్‌తో 835 కిలోమీటర్ల ప్రయాణాన్ని చేయవచ్చు. దీనితో పోలిస్తే టెస్లా మోడల్ వైలో 78.4 kWh బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉండి, 719 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణిస్తుంది.
వివరాలు
టెస్లాకు పెరిగిన సవాళ్లు!
చైనా టెస్లా కంపెనీకి అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటి. 2025 తొలి త్రైమాసికంకి వచ్చిన ఫలితాల ప్రకారం టెస్లా మొత్తం ఆదాయంలో 20 శాతం వరకు చైనా మార్కెట్ నుంచే వచ్చిందని తెలుస్తోంది. అయితే,2020లో చైనా EV మార్కెట్‌లో టెస్లా వాటా 15శాతంగా ఉండగా,2024 నాటికి అది 10శాతానికి తగ్గిపోయింది. చైనాలో ఉన్న దేశీయ సంస్థల తీవ్ర పోటీ కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతోంది.ఈ పోటీని తట్టుకోవడానికి టెస్లా తరచుగా తన కార్ల ధరలను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పుడు షావోమీ YU7 లాంచ్ అయిన నేపథ్యంలో మళ్ళీ ధర తగ్గింపులు చేయాల్సి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
టెస్లాకు పెరిగిన సవాళ్లు!
అంతేకాదు, ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్‌కు అవసరమైన డ్రైవర్ అసిస్టెన్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా ఇవ్వడం, ఇంకా ఉత్తమమైన ఫైనాన్స్ సదుపాయాలు అందించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం టెస్లాపై ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.