టెస్ట్ రన్ లో ఉన్న Citroen C3- MPV కార్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
Citroen సంస్థ యూరోపియన్ ప్రాంతంలో C3-ఆధారిత మూడు-వరుసల MPV కార్ టెస్ట్ రన్ చేస్తుంది. ఈ ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 2023లో భారతీయ మార్కెట్ లో మూడు వరుసల MPV మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఈ సరికొత్త మోడల్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. Citroen C3 గత ఏడాది భారత మార్కెట్లోకి వచ్చింది. ఎంట్రీ-లెవల్ మైక్రో-SUV సెగ్మెంట్‌లో ఈ కారు టాటా Punch, Renault Kiger వంటి వాటితో పోటీపడుతుంది.
కార్
ధర. ఇతర వివరాలు ఈ ఏడాది చివరలో లాంచ్ ఈవెంట్ లో Citroen ప్రకటిస్తుంది
ఆ అదరణ నుండి ప్రయోజనం పొందడానికి తయారీ సంస్థ ఇప్పుడు ఈ మూడు-వరుసల వేరియంట్‌ను కూడా లాంచ్ చేయాలని నిర్ణయించుకుంది. దీని ముందు మోడల్స్ లాగానే ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది.
ఈ కారు 1.2-లీటర్, లిక్విడ్-కూల్డ్, టర్బో-పెట్రోల్ ఇంజన్ తో నడుస్తుంది. ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EDB, వెనుక కెమెరా ఉంటాయి.
ఈ కార్ ధర, ఇతర వివరాలను 2023 చివరిలో Citroen సంస్థ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటిస్తుంది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.