Page Loader
Tata Nexon: టాటా నెక్సాన్ డీలర్‌కు రూ. 30,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం 
టాటా నెక్సాన్ డీలర్‌కు రూ. 30,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం

Tata Nexon: టాటా నెక్సాన్ డీలర్‌కు రూ. 30,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2024
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

నాణ్యమైన వాహనాల తయారీ, సాటిలేని భద్రతా ఫీచర్ల కారణంగా టాటా కంపెనీ వాహనాలు వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి. టాటా మోటార్స్‌కు మార్కెట్‌లో ఎక్కువ ఆధిపత్యం ఉండడానికి ఇదే కారణం, అయితే టాటా మోటార్స్‌తో చండీగఢ్‌లో నివసిస్తున్న వ్యక్తి కి చేదు అనుభవం ఎదురైంది. ఈ వ్యక్తి లోపభూయిష్ట వాహనాన్ని విక్రయించినందుకు టాటా మోటార్స్, డీలర్‌పై ఫిర్యాదు చేశారు. ముంబైలోని టాటా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, చండీగఢ్‌లోని ఆర్‌ఎస్‌ఎ డైనమిక్ మోటార్స్ ఎల్‌ఎల్‌పిపై దుర్గేష్ కుమార్ ఝా కేసు వేశారు. వినియోగదారుల కోర్టు ఇరుపక్షాల వాదనలు విని, కేసును క్షుణ్ణంగా అర్థం చేసుకున్న కోర్టు ఈ కేసులో కస్టమర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చి, డీలర్‌కు రూ.30,000 పరిహారం చెల్లించాలని టాటా మోటార్స్‌ను ఆదేశించింది.

వివరాలు 

Tata Nexon Defective: మొత్తం విషయం ఏమిటి?

నివేదికల ప్రకారం, దుర్గేష్ కుమార్ ఝా మార్చి 25, 2022న చండీగఢ్‌లోని RSA డైనమిక్ మోటార్స్ LLP నుండి టాటా నెక్సాన్ XM (S) పెట్రోల్ కారును రూ. 8 లక్షల 96 వేల 900కి, రూ. 55,400 విలువైన యాక్సెసరీలను కొనుగోలు చేశారు. దుర్గేష్ కుమార్ ఝా తన కొత్త కారును షోరూమ్ నుండి తీసుకున్నాక ఇంటికి బయలుదేరిన వెంటనే, కారు మధ్యలో ఉన్న ఇగ్నిషన్ బాక్స్‌లో మెకానికల్/టెక్నికల్ సమస్య ఉందని గ్రహించాడు. దీంతో పాటు మ్యూజిక్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయలేదు. వాహనం ఇంజిన్ ఏప్రిల్ 2022 లో మార్చారు.కానీ మూడు నెలల్లో వాహనంలో కొత్త సమస్యలు కనిపించడం ప్రారంభించాయి.

వివరాలు 

తనను తాను సమర్థించుకున్న టాటా మోటార్స్ 

అంతేకాదు వాహనం తలుపుల సమస్యలు కూడా మొదలయ్యాయి. దుర్గేష్ కుమార్ ఝా మాట్లాడుతూ, తాను కారును కొనుగోలు చేసి మూడు నెలలు అవువుతోందని , కారు ఇంజిన్, డోర్లు,ఇన్‌బిల్ట్ లాకింగ్ సిస్టమ్‌లో సమస్యలు కనిపించడం ప్రారంభించాయని తెలిపారు. నివేదికల ప్రకారం, వాహనంలో పెద్దగా సమస్యలు లేవని టాటా మోటార్స్ తెలిపింది. ఈ కారు ఇప్పటికే 12,000 కిలోమీటర్లకు పైగా నడపబడిందని,రహదారి పరిస్థితులు,వాహనం వినియోగం కారణంగా,మ్యూజిక్ సిస్టమ్ లేదా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్‌లో లోపం వంటి చిన్న సమస్యలు ఎదురవుతాయని కంపెనీ తెలిపింది. అదే సమయంలో,ఇంజిన్ రీప్లేస్‌మెంట్ తర్వాత,ఇంజిన్‌కు సంబంధించిన ఇతర సమస్యలు లేవని డీలర్ వాదించారు. కస్టమర్ తన వాహనాన్నిఇతర ఏజెన్సీ నుండి కనీసం మూడుసార్లు సర్వీస్ చేయించుకున్నాడని కూడా డీలర్ చెప్పాడు.

వివరాలు 

ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు నిర్ణయం 

కొత్త వాహనంలో అనేక సమస్యలు ఉన్నాయని, దీని కారణంగా వినియోగదారుడు మళ్లీ మళ్లీ వర్క్‌షాప్‌ను సందర్శించాల్సి వచ్చిందని కోర్టు గుర్తించింది. వారంటీలో ఉన్నప్పటికీ తన కారును వినియోగించుకోలేక దుర్గేష్ కుమార్ ఝా పడిన మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.