వైరల్ వీడియోలో నెటిజన్లను ఆకర్షిస్తున్న 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా
ఒక డ్రైవరు తన ఆటో-రిక్షాను ఎలక్ట్రిక్‌తో పనిచేసే రూఫ్‌ని ఉండేలా తయారుచేశాడు, నెటిజన్లు దీనిని 'రోల్స్-రాయిస్ ఆఫ్ ఆటో-రిక్షా' అని పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. వర్షం, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి డ్రైవర్ ప్రయాణీకులను రక్షించడానికి ప్రామాణిక ఆటో-రిక్షా పైకప్పులు సాధారణంగా మందపాటి బట్టతో కప్పి ఉంటాయి. ఈ ఆటోలో ఒక బటన్‌ను నొక్కినప్పుడు పైకప్పు భాగాలు వెనుక పెద్ద యూనిట్‌లోకి వెళ్లిపోతాయి. కార్ సన్‌రూఫ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఉంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ కామెంట్ సెక్షన్‌లో ఆ డ్రైవరును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వైరల్ వీడియోలో 'కన్వర్టబుల్' ఆటో-రిక్షా
ఆటో-రిక్షాలో కాంటౌర్ సీట్లు, ప్రత్యేకమైన పెయింట్‌వర్క్ కూడా ఉన్నాయి
ఒక ఇంస్టాగ్రామ్ వినియోగదారు ఈ త్రీ-వీలర్‌ను "ఆటో కూపర్" (BMW యాజమాన్యంలోని MINI కూపర్‌లో ప్లే) అంటే, మరొకరు దీనిని "రోల్స్-రాయిస్ ఆఫ్ ఆటో" అని కామెంట్ చేశారు. ఒక వినియోగదారు ఆ ఆటో-రిక్షాలో ప్రయాణించడం ఖరీదైన వ్యవహారమని 10 కిలోమీటర్లకు రూ.850 అన్నాడు. ఆటో-రిక్షాలో కాంటౌర్ సీట్లు, ప్రత్యేకమైన పెయింట్‌వర్క్ కూడా ఉన్నాయి. భారతదేశంలోని అనేక నగరాల్లో మహిళా ప్రయాణికుల కోసం అందుబాటులో ఉన్న 'పింక్ ఆటో'ల రంగుతో ఉంటుంది. ఈ వీడియో ఫిబ్రవరి 22న పోస్ట్ అయింది, ఇది ఇప్పటికే ఒక మిలియన్ వీక్షణలను పొందింది. గత నెల నుండి పోస్ట్ కు దాదాపు 75,000 లైక్‌లు, 220కి పైగా కామెంట్లు వచ్చాయి.