Page Loader
Kia Carens Clavis EV: కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి కౌంట్‌డౌన్.. జూలై 15న గ్రాండ్ లాంచ్!
కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి కౌంట్‌డౌన్.. జూలై 15న గ్రాండ్ లాంచ్!

Kia Carens Clavis EV: కియా కారెన్స్ క్లావిస్ ఈవీకి కౌంట్‌డౌన్.. జూలై 15న గ్రాండ్ లాంచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

కియా ఇండియా తన ప్రముఖ 7 సీటర్ల ఎమ్‌పీవీ కారెన్స్‌కి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకొచ్చింది. కారెన్స్ క్లావిస్ ఈవీ పేరుతో ఈ కొత్త ఎమ్‌పీవీని జూలై 15న ఉదయం 11:59 గంటలకు అధికారికంగా లాంచ్ చేయనుందని సంస్థ ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో కారెన్స్ పెట్రోల్/డీజిల్ మోడళ్లు హిట్ కావడంతో.. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కంపెనీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఇది భారత మార్కెట్లో మూడు వరుసల సీటింగ్‌తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీగా రికార్డుకెక్కబోతోంది.

Details

రేంజ్ & బ్యాటరీ వివరాలు

క్రెటా ఈవీ మాదిరిగానే ఈ కారెన్ క్లావిస్ కూడా రెండు బ్యాటరీ వేరియంట్లలో రానుందని తెలుస్తోంది. 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ - సుమారు 390 కిలోమీటర్ల రేంజ్, 51.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ - దాదాపు 473 కిలోమీటర్ల రేంజ్, మోటార్ అవుట్‌పుట్స్ వరుసగా 133 bhp, 169 bhpగా ఉండొచ్చు. డిజైన్ & ఫీచర్లు ఈ ఈవీ కారులో అత్యాధునిక ఫీచర్లు గల డిజైన్‌ను అందించారు డ్యూయల్ 12.3 అంగుళాల డిజిటల్ స్క్రీన్లు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్, మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం) డ్యూయల్ టోన్ 2-స్పోక్ స్టీరింగ్ వీల్ టెంపరేచర్, వాల్యూమ్‌ను టచ్‌తో నియంత్రించగల స్మార్ట్ కంట్రోల్ ప్యానెల్ లేత గోధుమ రంగు లెదర్ సీట్స్ మధ్యలో కెప్టెన్ సీటు

Details

మరిన్ని ఫీచర్లు

పనోరమిక్ సన్‌రూఫ్ 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ 4-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ప్యాడిల్ షిఫ్టర్లు లెవల్ 2 ADAS, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ V2L, V2X సపోర్ట్ రంగుల ఎంపికలు 8 మోనో టోన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి గ్రావిటీ గ్రే అరోరా బ్లాక్ పెర్ల్ గ్లేసియర్ వైట్ పెర్ల్ క్లియర్ వైట్ ఇంపీరియల్ బ్లూ ప్యూటర్ ఆలివ్ ఐవరీ సిల్వర్ గ్లాస్ స్పార్క్లింగ్ సిల్వర్

Details

ఈ కారు పోటీ పడబోయే ప్రధాన ఈవీలు

మారుతి ఈ విటారా ఎంజీ జెడ్ఎస్ ఈవీ టాటా కర్వ్ ఈవీ మహీంద్రా బీఈ6 హ్యుందాయ్ క్రెటా ఈవీ టయోటా, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా, హోండా రాబోయే ఎలక్ట్రిక్ కార్లు వేరియంట్‌లపై అధిక వేరియంట్లు: నేవీ బ్లూ, బీజ్ తక్కువ వేరియంట్లు: నలుపు, లేత గోధుమ ఈవీ విభాగంలో శక్తివంతమైన మోడళ్లను ఎదుర్కొనేందుకు కియా కారెన్స్ క్లావిస్ ఈవీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. జూలై 15న దీనికి సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు వెల్లడి కానున్నాయి.