బజాబ్ నుండి క్రేజీ అప్డేట్.. త్వరలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియాలో జోరుగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారీకి మొగ్గు చూపుతున్నాయి. కొత్తగా మరో దిగ్గజ సంస్థ బజాబ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నట్లు సమాచారం. స్వింగర్, జీనీ వంటి రెండు పేర్లను కూడా జజాబ్ ఆటో ఇటీవలే రిజిస్టర్ చేసుకుంది. ఇవి రాబోయే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇండియా పేటెంట్స్ డిజైన్ అండ్ ట్రైడ్ మార్క్స్ వెబ్ సైట్ లో స్వింగర్, జీనీ పేర్లు మే నెలలోనే కనిపించాయి. వీటిని బజాబ్ ఆటో ట్రైడ్ మార్క్ చేసుకున్నట్లు తేలింది. వీటికి సంబంధించిన ఇతర వివరాలు లేకపోవడం గమనార్హం.
స్వింగర్, జీనీ పేరుతో బజాబ్ రిజిస్ట్రేషన్
బజాజ్ ఆటోకు ప్రస్తుతం చేతక్ ఈవీ ఉన్న విషయం తెలిసిందే. ఇక స్వింగర్, జీనీ కూడా చేతక్ సరసన చేరే అవకాశం ఉంది. గతంలో బజాబ్ ఆరా, హామర్, రేసర్ వంటి పేర్లను బజాజ్ ఆటో ట్రేడ్ మార్క్ చేసుకుంది. కానీ వాటిని 2వీలర్, 3వీలర్‌కు ఉపయోగించలేదు. మరి జీనీ, స్వింగర్ లను వాడుకుంటుందో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. చేతక్ ఈవీ సప్లై చెయిన్ వ్యవస్థలో చాలా లోపాలు గుర్తించారు. తాజాగా వీటిని సవరించినట్లు తెలుస్తోంది. దీంతో చేతక్ ఈవీ వాల్యూమ్‌లు పెరుగుతాయని భావిస్తున్నారు. చేతక్ బ్రాండ్ లోనే కొన్ని ప్రొడక్టులను కూడా సంస్థ తీసుకొచ్చే అవకాశం ఉంది.