Loading...
Denza D9 Z9 GT India Launch: ఇండియాలోకి డెంజాD9, Z9 జీటి.. గ్రాండ్‌ ఎంట్రీ
ఇండియాలోకి డెంజాD9, Z9 జీటి.. గ్రాండ్‌ ఎంట్రీ

Denza D9 Z9 GT India Launch: ఇండియాలోకి డెంజాD9, Z9 జీటి.. గ్రాండ్‌ ఎంట్రీ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 13, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన BYD లగ్జరీ బ్రాండ్ Denza భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. నవంబర్ 13న Denza D9, Z9 GT రెండు మోడళ్లను భారత్‌లో విడుదల చేయనుంది. పూర్తిగా విదేశాల్లో తయారు చేసి తీసుకొచ్చే CBU మోడళ్లుగా ఇవి భారత మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఈ రెండు కార్లతో ప్రీమియం సెగ్మెంట్‌లో Denza తన స్థానాన్ని ఏర్పరుచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా భారీ ధర, అధునాతన ఫీచర్లతో వచ్చే ఈ కార్లు సాధారణ లగ్జరీ కార్లకు భిన్నమైన అనుభవాన్ని అందించనున్నాయి.

Details

D9లో వెనుక సీటుకే ఎక్కువ ప్రాధాన్యం

Denza D9 ఒక పెద్ద 7-సీటర్ లగ్జరీ MPV. ఇందులో 2+2+3 సీటింగ్ లేఅవుట్ ఉంటుంది.

రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఉండగా.. పవర్ అడ్జస్ట్‌మెంట్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ వంటి సౌకర్యాలు లభిస్తాయి.

15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, 14-స్పీకర్ Dynaudio ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Details

Z9 GT.. స్పీడ్‌తో పాటు కొత్త డిజైన్

Z9 GT ప్రత్యేకమైన షూటింగ్ బ్రేక్ డిజైన్‌తో వస్తుంది. సుమారు 5,180 మిమీ పొడవు, 3,125 మిమీ వీల్‌బేస్‌తో ఉండే ఈ కారు మూడు స్క్రీన్ల డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది.

17.3 అంగుళాల సెంట్రల్ స్క్రీన్, 13.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, ప్యాసింజర్ స్క్రీన్‌తో పాటు నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజ్ సీట్లు, AR హెడ్-అప్ డిస్‌ప్లే, 20-స్పీకర్ Devialet ఆడియో సిస్టమ్ ఉన్నాయి.

రియర్-వీల్ స్టీరింగ్ కారణంగా 'క్రాబ్ వాక్' ఫీచర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ADVERTISEMENT

Details

1,156 హెచ్‌పీ పవర్.. 2.7 సెకన్లలో 100 కిమీ

Z9 GTలో 122.5kWh బ్యాటరీ, మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండనున్నాయి. ఇవి కలిపి 1,156hp, 1,200Nm శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

0-100 కిమీ వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో అందుకుంటుందని Denza చెబుతోంది. దీని టాప్ స్పీడ్ 270 కిమీగా ఉంటుంది.

మరోవైపు D9లో 103.36kWh బ్యాటరీతో గరిష్ఠంగా 520 కిమీ WLTP రేంజ్ లభిస్తుంది. D9 ధర సుమారు రూ.90 లక్షలు, Z9 GT ధర రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

ADVERTISEMENT