Page Loader
Amalfi 2025: అదిరిపోయే డిజైన్‌తో 'ఫెరారీ అమాల్ఫీ 2025' లాంచ్‌.. ఫీచర్లు ఇవే!
అదిరిపోయే డిజైన్‌తో 'ఫెరారీ అమాల్ఫీ 2025' లాంచ్‌.. ఫీచర్లు ఇవే!

Amalfi 2025: అదిరిపోయే డిజైన్‌తో 'ఫెరారీ అమాల్ఫీ 2025' లాంచ్‌.. ఫీచర్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫెరారీ అమాల్ఫీ 2025 ఈ పేరు వినగానే స్పోర్ట్స్ కార్ల ప్రేమికుల్లో ఉత్సాహం ఊపందుకుంటోంది. ఫెరారీ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ సరికొత్త మోడల్‌ 'అమాల్ఫీ'. కార్ లవర్స్‌కి ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేశారు. గతంలో పెద్ద విజయం సాధించిన ఫెరారీ రోమాకి ఇది లెగసీ మోడల్‌గా వస్తోంది. డిజైన్ అద్భుతమే ఫెరారీ డిజైన్ చీఫ్ ఫ్లావియో మంజోని నేతృత్వంలో అమాల్ఫీని ఒక కళాఖండంలా రూపొందించారు. ముందు భాగంలో సంప్రదాయ గ్రిల్‌ను తీసేసి, బాడీ రంగులోనే కలిసిపోయే 'ఫ్లోటింగ్ వింగ్' డిజైన్‌ను అందించారు. స్టైలిష్ LED హెడ్‌లైట్లు, స్మార్ట్ సెన్సార్లతో కలిపి ఇది చాలా ఫ్యూచరిస్టిక్‌గా అనిపిస్తుంది.

Details

సూపర్బ్ ఫీచర్లు

వెనుక వైపుగా చూస్తే, బలమైన షోల్డర్ లైన్, కనిపించేలా కానట్టుగా ఉండే టెయిల్ లైట్లు... ఇవన్నీ క్లాసిక్ ఫెరారీ మోడల్స్‌ను గుర్తు చేస్తాయి. 'వెర్డే కోస్టీరా' అనే ప్రత్యేక టీల్ గ్రీన్ షేడులో అమాల్ఫీ మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతుంది. ఇంటీరియర్‌లో ఆధునికతతో రాజసంగా ఈ కారులో డ్యాష్‌బోర్డ్‌ను ముక్కలుగా కాకుండా, ఒకే ఫ్లోలో రూపొందించి, పైలట్ కాక్‌పిట్ అనుభూతిని తీసుకొచ్చారు. వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్, అనోడైజ్డ్ అల్యూమినియం గేర్ కంట్రోల్ టన్నెల్ ఆ కాంపాక్ట్ లుక్‌ను పెంచుతాయి. కంఫర్ట్ సీట్లు మూడు వేరియంట్‌లలో లభిస్తాయి. వీటిలో వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లు ఉండటంతో, ఎంతటి ప్రయాణమైనా అలసట తెలియదు.

Details

మ్యూజిక్ ప్రియులకు స్పెషల్

కారులో Burmester 14 స్పీకర్ల సౌండ్ సిస్టమ్, 1200 వాట్ల పవర్‌తో వస్తుంది. ఇది ఒక లైవ్ కాన్సర్ట్‌ అనుభూతిని కలిగిస్తుంది. ఇంటెలిజెంట్ మొబైల్ వింగ్ వెనుక భాగంలో ఆటోమేటిక్‌గా మారే 'యాక్టివ్ మొబైల్ వింగ్' ఉంది. ఇది మూడు మోడ్‌లలో పని చేస్తుంది Low Drag (LD): సాధారణ డ్రైవింగ్‌కు Medium Downforce (MD): వేగం పెరిగినప్పుడు High Downforce (HD): హై స్పీడ్ డ్రైవింగ్‌కు సంపూర్ణ స్టెబిలిటీ శక్తివంతమైన ఇంజిన్ - వేగానికి మరో నిర్వచనం 631 హార్స్‌పవర్ ఉన్న ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో, ఈ కారు కేవలం 3.3 సెకన్లలో 0-100 km/h, 9 సెకన్లలో 0-200 km/h వేగాన్ని చేరుతుంది.

Details

 బ్రేకింగ్, గ్రౌండ్ క్లియరెన్స్

బ్రేక్-బై-వైర్ టెక్నాలజీ ద్వారా అత్యధిక వేగంలో కూడా సురక్షితంగా బ్రేకింగ్ సాధ్యమవుతుంది. అలాగే ఫ్రంట్ లిఫ్టర్ సిస్టమ్ ద్వారా స్పీడ్ బ్రేకర్‌లు దగ్గర కారు ముందు భాగాన్ని 40 మిల్లీమీటర్ల వరకూ పైకి లేపవచ్చు. ఫెరారీ అమాల్ఫీ 2025 కేవలం ఒక స్పోర్ట్స్ కారు కాదు. ఇది ఫెరారీ శైలి, శక్తి, శాస్త్రీయ నైపుణ్యం, లగ్జరీకి ప్రతీక. స్పీడ్‌ను పూజించే వారికి ఇది ఒక కల, స్టేటస్‌కు విలువిచ్చే వారికి ఇది ఒక గుర్తింపు. ఫెరారీ ఈ కారుతో మరోసారి నిరూపించింది.