LOADING...
Electric vehicles: ఎలక్ట్రిక్ కారు యూజర్లకు గూగుల్ మ్యాప్ టిప్స్.. ఛార్జింగ్ స్టేషన్‌లు చిటికెలో కనిపించేలా ఇలా సెటప్ చేయండి!
ఎలక్ట్రిక్ కారు యూజర్లకు గూగుల్ మ్యాప్ టిప్స్.. ఛార్జింగ్ స్టేషన్‌లు చిటికెలో కనిపించేలా ఇలా సెటప్ చేయండి!

Electric vehicles: ఎలక్ట్రిక్ కారు యూజర్లకు గూగుల్ మ్యాప్ టిప్స్.. ఛార్జింగ్ స్టేషన్‌లు చిటికెలో కనిపించేలా ఇలా సెటప్ చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి భారీగా పెరుగుతోంది. ఈవీలపై డిమాండ్ పెరిగన నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావడంలో తలపడుతున్నాయి. అయితే ఈవీ కొనాలనుకునే వ్యక్తి ముందుగా ఆలోచించే అంశం 'రేంజ్'. ఎలక్ట్రిక్ వాహనం ఒక ఛార్జ్‌తో ఎంత దూరం వెళ్తుందన్నదే ప్రధాన అంశం. చాలామందిలో ఈ 'రేంజ్ యాంగ్జైటీ' కనిపిస్తోంది. మౌలిక వసతుల పెరుగుదల వల్ల ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్లు నగరాల్లో కనిపిస్తున్నప్పటికీ, రోడ్డుపై తిరుగుతున్న కార్లతో పోలిస్తే ఈవీ ఛార్జింగ్ పాయింట్లు తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణంలో సౌలభ్యం కల్పించేందుకు గూగుల్ మ్యాప్స్‌లో ప్రత్యేకమైన ఫీచర్‌ అందుబాటులో ఉంది.

Details

 గూగుల్ మ్యాప్స్‌లో EV ఛార్జింగ్ స్టేషన్లు చూసే విధానం

ఈ ఫీచర్‌ను ఉపయోగించి మీ ప్రయాణంలో ఎక్కడ ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. యూట్యూబర్ అక్కి నాగ్‌పాల్ తన అధికారిక ఛానెల్‌ ద్వారా ఈవీ యజమానులు గూగుల్ మ్యాప్స్‌ను ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చో వీడియో రూపంలో వివరించారు. ఈ ప్రక్రియను పాటించడం ద్వారా మీరు మీ కార్‌కు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించవచ్చు.

Details

ఫాలో చేయాల్సిన సింపుల్ స్టెప్స్ ఇవే

1. గూగుల్ మ్యాప్స్‌ యాప్ ఓపెన్ చేయండి 2. మీ ప్రొఫైల్ ఐకాన్ పై టాప్ రైట్ కార్నర్‌లో క్లిక్ చేయండి 3. Settings (సెట్టింగ్స్) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి 4. 'Your Vehicles' అనే ఆప్షన్‌ను ఎంచుకోండి 5. ఇక్కడ Petrol, Diesel, Hybrid, Electric అనే ఎంపికలు కనిపిస్తాయి. మీరు Electric ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి 6. దీనికి కొనసాగింపుగా 'Plugs and Adapters' అనే ఆప్షన్ తెరుస్తుంది. ఇందులో J1772, CCS (Combo 1), Type 2 వంటి ఛార్జర్ రకాల సమాచారం ఉంటుంది. మీ కార్‌కు సరిపోయే ప్లగ్‌ను ఎంచుకోండి 7. అంతకుముందు స్క్రీన్‌కు తిరిగి రావడానికి బ్యాక్ బటన్ నొక్కండి