Harley Davidson X440T: హార్లీ డేవిడ్‌సన్ X440 T లాంచ్.. మెరుగైన డిజైన్‌తో కొత్త బైక్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ మార్కెట్లో హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ 'ఎక్స్ 440 టీ' ఎంట్రీ ఇచ్చింది. ఈ బైక్ ధరను కంపెనీ రూ. 2.79 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ప్రకటించింది. బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే డెలివరీలు 2026 జనవరి నుంచి మొదలయ్యే అవకాశముందని సంస్థ తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన హీరో మోటోకార్ప్-హార్లీ డేవిడ్‌సన్ భాగస్వామ్యం నుంచి బయటకు వస్తున్న ఇది రెండో మోడల్. మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఎక్స్ 440 మోడల్‌తో పోలిస్తే, కొత్త టీలో మరికొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు కనిపిస్తాయి.
Details
ఎక్స్ 440 టీ - కాస్మెటిక్ అప్‌డేట్‌లు
బైక్ వెనుక భాగంలో చేసిన మార్పులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పొడవైన టెయిల్ కౌల్ సీటుకు కలిసిపోయేలా లాంగ్ టెయిల్ కౌల్ ను డిజైన్ చేశారు. పొడవైన సీటు కొత్తగా అమర్చిన సీటు మునుపటి దానికంటే పొడవుగా, విస్తారంగా ఉండడంతో వెనుక కూర్చునే ప్రయాణికుడికి మరింత సౌకర్యం లభిస్తుంది. దీంతో బైక్ రియర్ లుక్ ఎక్స్ 440 కంటే మరింత మెరుగ్గా కనిపిస్తోంది. బార్-ఎండ్ మిర్రర్లు స్టాండర్డ్ మిర్రర్ల స్థానంలో బార్-ఎండ్ మిర్రర్లు ఏర్పాటు చేశారు. కొత్త రంగులు మోడల్‌ను నాలుగు కొత్త కలర్లతో అందిస్తున్నారు వివిడ్ బ్లాక్ పెర్ల్ వైట్ పెర్ల్ బ్లూ పెర్ల్ రెడ్
Details
కొత్త గ్రాఫిక్స్
ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై రిఫ్రెష్‌డ్ గ్రాఫిక్స్ ఇచ్చారు. హీట్ షీల్డ్‌తో ఎగ్జాస్ట్ ఎక్స్ 440లో ఉన్నదే ఎగ్జాస్ట్‌ను ఉపయోగించినా, ఇందులో కొత్త హీట్ షీల్డ్ జోడించారు. ఎక్స్ 440 టీ - ఇంజిన్, పనితీరు మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇంజిన్: 440 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ పవర్: 27 బీహెచ్‌పీ టార్క్: 38 ఎన్ఎమ్ పీక్ టార్క్ గేర్‌బాక్స్: 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ హార్డ్‌వేర్ & బ్రేకింగ్ సెటప్ ఎక్స్ 440 టీ నిర్మాణంలో మంచి హార్డ్‌వేర్‌ను ఉపయోగించారు. టైర్లు ఎంఆర్‌ఎఫ్ జాపర్ హైక్ ట్యూబ్‌లెస్ టైర్లు ముందు:100/90-18 వెనుక: 140/70-17 వీల్స్ 18-ఇంచ్ ఫ్రంట్, 17-ఇంచ్ రియర్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
Details
బ్రేకింగ్
ముందుభాగం: 320 ఎంఎం డిస్క్ వెనుక: 240 ఎంఎం డిస్క్ రెండు వైపులా మెరుగైన బ్రేకింగ్ పనితీరును అందిస్తాయి. సస్పెన్షన్ ముందు: కేవైబీ 43 ఎంఎం USD ఫోర్క్‌లు (130 ఎంఎం ట్రావెల్) వెనుక: గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, 7-స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఫీచర్లు - ఎక్స్ 440 టీ హైలైట్స్ పూర్తి ఎల్‌ఈడి లైటింగ్ మల్టీ-ప్రొజెక్టర్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్ (సిగ్నేచర్ DRLతో) ఎల్‌ఈడి ఇండికేటర్లు ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్ ఆటో హెడ్‌ల్యాంప్ ఆన్ (AHO) సపోర్ట్
Details
3.5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే
ఇందులో కనిపించే సమాచారం: మైలేజ్ రేంజ్ గేర్ పొజిషన్ స్పీడోమీటర్ హై బీమ్ / టర్న్ ఇండికేటర్ స్టేటస్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ అలర్ట్లు సైడ్ స్టాండ్ వార్నింగ్ సర్వీస్ రిమైండర్లు లో ఫ్యూయల్ & ఇంజిన్ వార్నింగ్ బ్లూటూత్ కనెక్టివిటీ మ్యూజిక్ కంట్రోల్ హ్యాండ్స్-ఫ్రీ కాల్ మేనేజ్‌మెంట్ ఇవి టీఎఫ్‌టీ స్క్రీన్ నుంచే ఆపరేట్ చేయవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ 2A క్విక్ ఛార్జ్ 3.0 USB పోర్ట్