
Tata Harrier EV: హారియర్ EV అడ్వెంచర్ ఫీచర్లలో బెస్ట్.. రూ.21.49 లక్షలకే సూపర్ ఎస్‌యూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్ ఇటీవల లాంచ్ చేసిన టాటా హారియర్ EV ప్రస్తుతం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ ఎలక్ట్రిక్ SUVని కంపెనీ ప్రారంభ ధర రూ.21.49 లక్షలుగా ప్రకటించింది.
అయితే, లైనప్‌లోని మిగతా వేరియంట్ల ధరలను ఇంకా ప్రకటించలేదు.
లాంచ్ ఈవెంట్ సందర్భంగా టాటా మోటార్స్ హారియర్ EVని అడ్వెంచర్, ఫియర్‌లెస్, ఎంపవర్డ్ అనే మూడు వేరియంట్లలో అందించనున్నట్టు తెలియజేసింది.
బేస్ వేరియంట్‌గా అడ్వెంచర్ వేరియంట్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
Details
బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలు
అడ్వెంచర్ వేరియంట్ 65 కిలోవాట్ల చిన్న బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 120 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
టాప్-అప్ సమయంలో 20%-80% ఛార్జింగ్ కేవలం 25 నిమిషాల్లో పూర్తవుతుందని సమాచారం. ఈ వేరియంట్ రేర్ వీల్ డ్రైవ్ ఇంజిన్‌తో వస్తోంది.
ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 234 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Details
డ్రైవింగ్ అనుభవం
టాటా హారియర్ EV అడ్వెంచర్ వేరియంట్‌లో టాటా కొత్తగా పరిచయం చేసిన అల్ట్రా గ్లైడ్ సస్పెన్షన్ (ఫ్రీక్వెన్సీ ఆధారిత డంపర్లు) ఉంటుంది.
ఇందులో నార్మల్, వెట్/రెయిన్, రఫ్ రోడ్ మోడ్స్ సహా స్పోర్ట్, సిటీ, ఎకో డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి.
డ్రిఫ్ట్ మోడ్, నాలుగు రీజెనరేటివ్ మోడ్స్ (పెడల్ షిఫ్టర్ల ద్వారా నియంత్రించవచ్చు) కూడా అందించారు.
క్రూయిజ్ కంట్రోల్, అకౌస్టిక్ వెహికల్ అలెర్ట్ సిస్టమ్ (AVAS) వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
Details
ఎక్స్‌టీరియర్ అండ్ సేఫ్టీ ఫీచర్లు
18-ఇంచ్ అల్లాయ్ వీల్స్
ఏరో ఇన్సర్ట్స్‌తో డ్యూయల్ టోన్ పెయింట్
ఎల్ఈడీ బై ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్, డీఆర్ఎల్, టెయిల్‌లైట్స్
కనెక్టెడ్ లైట్లు (ఫ్రంట్, రేర్), రూఫ్ రైల్స్, ఇంటిగ్రేటెడ్ సైడ్ స్టెప్స్
షార్క్ ఫిన్ యాంటెనా, పడ్ల్ ల్యాంప్స్, రేర్ వైపర్ అండ్ వాషర్
సేఫ్టీ విషయానికొస్తే
6 ఎయిర్‌బ్యాగులు
అన్ని వీల్ డిస్క్ బ్రేకులు
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
రేర్ పార్కింగ్ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్
హిల్ హోల్డ్, హిల్ డిసెంట్ కంట్రోల్
కార్నరింగ్ స్టెబిలిటీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్
బ్రేక్ డిస్క్ వైపింగ్
Details
ఇంటీరియర్ ఫీచర్లు
45W USB-C పోర్టులు, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్
టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్
లెథరెట్ సీటింగ్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్
ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVMs (ఆటో ఫోల్డ్ ఫంక్షన్‌తో)
V2V, V2L సామర్థ్యం
Details
కంపోర్ట్ పరంగా
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు
4-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ ప్యాసింజర్ సీటు
రేర్ AC వెంట్స్
డ్యూయల్ 10.25-ఇంచ్ డిస్‌ప్లేలు
IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో
ధర, లభ్యత
ప్రస్తుతం కంపెనీ అధికారికంగా రూ.21.49 లక్షల ప్రారంభ ధరను ప్రకటించింది.
మిగిలిన వేరియంట్ల పూర్తి ధరలు, ఆన్ రోడ్ ప్రైజింగ్ త్వరలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు వచ్చాక మేమే ముందుగా మీకు తెలియజేస్తాము.