Page Loader
Hero Karizma XMR 210 : కరిష్మా నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు
కరిష్మా నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు

Hero Karizma XMR 210 : కరిష్మా నుంచి కొత్త బైక్.. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 29, 2023
03:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్, ఇండియా మార్కెట్లోకి నూతన బైక్ ను రిలీజ్ చేసింది. స్టైలిష్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్లతో కర్మిష్మా ఎక్స్ఎంఆర్ 210ని లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ బైక్ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్ లో వైడ్ హ్యాండిల్ ల్యాంప్, ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అలాయ్ వీల్స్, విజర్, స్ల్పిట్ సీట్, ఎక్స్ఎంఆర్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బ్లాక్, యెల్లో, రెడ్ వంటి కలర్లలో రానుంది. ఇది 25.5 హెచ్‌పీ పవర్‌ను, 20.4 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది.

Details

 బ్రాండ్ అంబాసిడర్ గా హృతిక్ రోషన్

హీరో కరిష్మా ఎక్స్ఎంఆర్‌లో 210 సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ డీఓహెచ్‌సీ 4వీ ఇంజిన్ ఉండనుంది. మూడు నెలల్లో కంపెనీ నుంచి వస్తున్న మూడో ప్రీమియం మోడల్ ఈ బైక్ అని, యువతను అట్రాక్ట్ చేసే విధంగా దీన్ని రూపొందించామని, రానున్న రోజుల్లో మరెన్నో మోడల్స్ ను లాంచ్ చేస్తామని సీఈఓ నిరంజన్ గుప్త పేర్కొన్నారు. ఈ బైక్ ధర రూ. 2. 3లక్షల నుంచి 2.5 లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి. ఇక ఈ మోడల్ బుకింగ్స్ నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ బైక్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు హృతిక్ రోషన్ ఉన్న విషయం తెలిసిందే.