Hero MotoCorp: జూలై 3నుంచి హీరో బైకులు, స్కూటర్ల ధరల పెంపు
దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వినియోగదారులకు షాకింగ్ విషయం చెప్పింది. జులై 3వ తేదీ నుంచి తన బైక్, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ధరల సవరణతో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 1.5 శాతం వరకు పెరుగుతాయి. ఈ క్యాలెండర్ ఏడాదిలో వాహనాలపై హీరో కంపెనీ ధరలు పెంచడం ఇది రెండోసారి. ద్విచక్ర వాహన ధరల సవరణ అనేది కంపెనీ ఎప్పటికప్పుడు చేపట్టే ధరల సమీక్షలో భాగమని హీరో మోటోకార్ప్ సంస్థ తెలిపింది. ఖర్చులు, వంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార అవసరాలకు అనుగూనంగా ధరల సవరణ ఉంటుందని కంపెనీ వాహన మేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
కొత్త సీఈఓ రాక, నూతన ఉత్పత్తులతో హీరో మోటోకార్ప్‌లో జోష్
దేశంలోని చాలా ప్రాంతాలలో రుతుపవనాల ప్రారంభం అనేది ఆర్థిక వృద్ధికి సూచికగా కంపెనీ భావిస్తోంది. దీని వల్ల గ్రామీణ మార్కెట్లో రాబోయే పండుగ సీజన్‌లో అమ్మకాలు జరిగిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. కొత్త సీఈఓ నిరంజన్ గుప్తా నియామకంతో పాటు అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించినందున హీరో మోటోకార్ప్‌కు 2023 ఒక ప్రత్యేకం అని చెప్పాలి. హీరో మోటోకార్ప్ ఇటీవల దేశీయంగా ఇటీవల Xtreme 160R కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. Hero Xtreme 160R 4V మోడల్‌ను భారతదేశంలో రూ. 1.27 లక్షల ప్రారంభ ధర(దిల్లీ ఎక్స్-షోరూమ్)తో విడుదల చేయబడింది. హీరో మోటోకార్ప్‌తో కలిసి హార్లే-డేవిడ్‌సన్ తయారు చేసిన X440 మోడల్ బైక్ జులై 4న లాంచ్ కాబోతోంది.