Hero Splendor Plus : హీరో స్ల్పెండర్ ప్లస్ ధర పెంపు.. వేరియంట్లు, కొత్త రేట్లు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో మూడు దశాబ్దాలుగా విశ్వసనీయతను సంపాదించిన బ్రాండ్ ఏదైనా ఉంటే అది 'హీరో స్ల్పెండర్' అని చెప్పాలి. ఎక్కడికైనా సులభంగా వెళ్ళగల సామర్థ్యం, అద్భుతమైన మైలేజీ లక్షణాల కారణంగా, అభిమానులు దీన్ని ముద్దుగా 'లార్డ్ స్ల్పెండర్' అని పిలుస్తారు. అయితే ఇప్పుడు హీరో స్ల్పెండర్ ప్లస్ బైక్ ధర స్వల్పంగా పెరిగింది. విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడం వలన కంపెనీ ఈ ధర సవరణను ప్రకటించింది. ఈ నేపథ్యంలో హీరో స్ల్పెండర్ ప్లస్ వేరియంట్లు, వాటి కొత్త ఎక్స్షోరూం ధరలు ఇలా ఉన్నాయి:
Details
హీరో స్ల్పెండర్ ప్లస్ కొత్త ధరలు
డ్రమ్ - ₹74,152 ఐ3ఎస్ - ₹75,305 125 మిలియన్ - ₹76,437 ఎక్స్టెక్ - ₹77,678 ఎక్స్టెక్ 2.0 (డ్రమ్) - ₹80,214 ఎక్స్టెక్ 2.0 (డిస్క్) - ₹80,721 ధర పెంపు కేవలం ₹250 మాత్రమే చేశారు. విశ్లేషకుల అభిప్రాయంలో, ఈ నామమాత్రపు పెంపు మధ్యతరగతి కొనుగోలుదారులపై పెద్ద భారం కాకుండా బైక్ విలువను, నాణ్యతను కాపాడే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయం.
Deetails
ఇంజిన్, పెర్ఫార్మెన్స్
ధర పెరిగినా బైక్ పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంతకాలంగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన 100 సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగిస్తున్నారు. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అవుతుంది. పవర్: 7.09 BHP టార్క్: 8.05 Nm ప్రయాణ సౌకర్యం కోసం ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్-షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఈ మెకానికల్ సెటప్ రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఉంది.
Details
మార్కెట్ పరిస్థితి
2025 ప్రారంభంలో స్ల్పెండర్ ప్లస్ బేస్ వేరియంట్ ధర ₹80,000 ను తాకింది. 2025 సెప్టెంబర్‌లో 'జీఎస్టీ 2.0' అమలుతో ధరలు కొంత తగ్గాయి. ఇప్పుడు చేసిన ఈ స్వల్ప ధర సవరణ పెరిగిన ఉత్పత్తి వ్యయాలను సమతుల్యం చేయడానికి తీసుకున్న నిర్ణయం. భారతీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కమ్యూటర్ బైక్‌గా స్ల్పెండర్ ప్లస్ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కొత్త మోడళ్లు వచ్చినా హీరో స్ల్పెండర్ పట్ల భారతీయుల నమ్మకం తగ్గలేదు.