Page Loader
Honda Amaze: భారత మార్కెట్లోకి హోండా అమేజ్‌.. ధరలు రూ. 8 లక్షలకే ADAS ఫీచర్లు 
భారత మార్కెట్లోకి హోండా అమేజ్‌.. ధరలు రూ. 8 లక్షలకే ADAS ఫీచర్లు

Honda Amaze: భారత మార్కెట్లోకి హోండా అమేజ్‌.. ధరలు రూ. 8 లక్షలకే ADAS ఫీచర్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2024
03:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హోండా, తన తాజా మోడల్ అమేజ్‌ 2024ను విడుదల చేసింది. ఈ కొత్త కారు ప్రారంభ ధరను రూ.8 లక్షలుగా నిర్ణయించగా, అత్యధిక వేరియంట్ ధర రూ.10.90 లక్షలు ఉంది. మూడవ తరం మోడల్‌గా వచ్చిన ఈ సెడాన్‌లో డిజైన్‌, ఫీచర్లలో అనేక ఆధునిక మార్పులు చేసిన హోండా, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS) వంటి ప్రత్యేకతలను జోడించింది. ఈ కారు మూడు వేరియంట్లలో (వీ, వీఎక్స్‌, జడ్‌ఎక్స్‌) లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్‌ ఐ-వీటెక్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చగా, ఇది 89 బీహెచ్‌పీ పవర్‌, 110ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

వివరాలు 

లీటర్‌కు 19.46 కిలోమీటర్ల మైలేజ్‌

మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో లీటర్‌కు 18.65 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని,సీవీటీ వేరియంట్‌ లీటర్‌కు 19.46 కిలోమీటర్ల మైలేజ్‌ అందిస్తుందని హోండా వెల్లడించింది. ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ విషయంలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, డీఆర్‌ఎల్స్‌, టర్న్‌ ఇండికేటర్లు, వెనుక భాగంలో ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌, 15 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ అలాయ్‌ వీల్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటీరియర్‌లో 8 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, వైర్లెస్‌ ఛార్జర్‌, ఫుల్లీ ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, పుష్‌ స్టార్ట్‌/స్టాప్‌ బటన్‌, వాక్‌ అవే ఆటో లాక్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

వివరాలు 

ప్రముఖ బ్రాండ్ లకు హోండా అమేజ్‌ 2024 గట్టి పోటీ

భద్రత విషయంలో హోండా సెన్సింగ్‌ సూట్‌ ద్వారా 28 యాక్టివ్‌, పాసివ్‌ ఫీచర్లు అందించగా, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌ వంటి సదుపాయాలు లభిస్తాయి. మారుతీ సుజుకీ డిజైర్‌, హ్యుందాయ్‌ ఆరా, టాటా టిగోర్‌ వంటి మోడళ్లకు హోండా అమేజ్‌ 2024 గట్టి పోటీని ఇవ్వనుంది.