Page Loader
Honda Dio Scooter: హోండా డియో 2025.. 1 లక్ష ధరలో టెక్నాలజీ, స్టైల్‌తో కొత్త ఎక్స్‌పీరియెన్స్!
హోండా డియో 2025.. 1 లక్ష ధరలో టెక్నాలజీ, స్టైల్‌తో కొత్త ఎక్స్‌పీరియెన్స్!

Honda Dio Scooter: హోండా డియో 2025.. 1 లక్ష ధరలో టెక్నాలజీ, స్టైల్‌తో కొత్త ఎక్స్‌పీరియెన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2025
11:56 am

ఈ వార్తాకథనం ఏంటి

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తమ ఐకానిక్ మోడల్ 'డియో'ను నవీకరించి, తాజా 2025 వర్షన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. 'డియో వాంట్ టు హవ్ ఫన్?' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ మోడల్‌కి కాస్మెటిక్ మార్పులు, ఆధునిక టెక్నాలజీ, కొత్త ఫీచర్లు, ఓబీడీ 2 బీ కంప్లైంట్ ఇంజిన్ తో మరింత ఆకర్షణ కలిగింది. రెండు వేరియంట్లలో లాంచ్ 2025 హోండా డియో DLX, H-Smart వేరియంట్లలో లభ్యమవుతుంది. వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు వరుసగా రూ.96,749, నుంచి రూ.1,02,144గా నిర్ణయించారు.

Details

ఫీచర్ల వివరాలు

కొత్త డియో ఇప్పుడు 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో మైలేజ్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్, రేంజ్ డేటా (ఎమ్టీ డిస్టెన్స్), నేవిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. Honda RoadSync యాప్‌ ద్వారా స్కూటర్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ కీ వ్యవస్థ, మొబైల్ చార్జింగ్‌ కోసం USB టైప్ C పోర్ట్ వంటి అదనపు సౌకర్యాలు ఉన్నాయి. రంగుల ఎంపిక 2025 హోండా డియో స్కూటర్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్ పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే పెర్ల్ స్పోర్ట్స్ యెల్లో పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ ఇంపీరియల్ రెడ్

Details

 ఇంజిన్ స్పెసిఫికేషన్లు 

ఈ మోడల్‌లో 123.92 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. ఇది 8.19 బీహెచ్‌పీ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. అంతేగాకుండా, ఇంధన వినియోగం తగ్గించేందుకు ఐడ్లింగ్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. హోండా ప్రతినిధుల వ్యాఖ్యలు హోండా సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ OBD 2 B వెర్షన్ డియో 125 ని విడుదల చేయడం గర్వంగా ఉంది. తాజా ఫీచర్లు, డిజైన్ తో ఇది యువతను మెప్పించే విధంగా తీర్చిదిద్దుతామని అన్నారు. హోండా ఎండీ, సీఈఓ సుత్సుము ఒటాని మాట్లాడుతూ, 21 ఏళ్లుగా భారత మార్కెట్‌లో డియో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Details

అత్యాధునిక ఫీచర్లు

ట్రెండీ, నమ్మదగిన మోటో-స్కూటర్‌గా కొనసాగుతూ, కొత్త వెర్షన్ ద్వారా వినియోగదారులకు అదనపు విలువ అందించనున్నామని అన్నారు. మొత్తానికి 2025 హోండా డియో 125 ఫన్, ఫీచర్స్, ఫ్యూచర్ అన్నీ కలిపి వినియోగదారుల ఆకాంక్షలకు అద్భుతంగా సరిపోయే మోడల్ గా నిలుస్తోంది.