LOADING...
Honda N-One e Unveiled: ఈ కారును అరగంట ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు.. అదిరిపోయే లుక్‌..
ఈ కారును అరగంట ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు.. అదిరిపోయే లుక్‌..

Honda N-One e Unveiled: ఈ కారును అరగంట ఛార్జ్ చేస్తే 245 కి.మీ. వరకు వెళ్లొచ్చు.. అదిరిపోయే లుక్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దాదాపు అన్ని ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఈ విభాగంలో కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో హోండా కూడా ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును త్వరలో విడుదల చేయబోతోంది. 'హోండా N-One e' పేరుతో ఈ కారు మార్కెట్‌లోకి రానుంది. ఇప్పటివరకు హోండా రూపొందించిన ఎలక్ట్రిక్ కార్లలో ఇది అత్యంత చిన్నదిగా నిలవనుందని చెప్పొచ్చు.

వివరాలు 

రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మోడల్ 

ఈ కారును హోండా తొలిసారిగా 'గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్' అనే ప్రఖ్యాత ఈవెంట్‌లో, తమ ఫ్యూచరిస్టిక్ సూపర్ ఈవీ కాన్సెప్ట్ భాగంగా ప్రదర్శించింది. అయితే ఇది కేవలం ఒక ప్రయోగాత్మక కాన్సెప్ట్ కారు కాదు. రోజువారీ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన మోడల్ అని హోండా స్పష్టం చేసింది. సెప్టెంబర్‌లో జపాన్ మార్కెట్‌లో ఈ కారును విడుదల చేసే అవకాశాలు ఉండగా, ఆ తర్వాత యూకేలో కూడా లాంచ్ చేసే యోచనలో ఉంది.

వివరాలు 

N-One e స్పెసిఫికేషన్లు, సామర్థ్యం: 

హోండా N-One e,ఇప్పటికే ఉన్న N-Van e ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించబోతున్నట్లు సమాచారం. N-Van e ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత సుమారు 245 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇది 50కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది, దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇదే ఫీచర్ N-One e కారులో కూడా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. రిపోర్టుల ప్రకారం,ఈ కారు శక్తి ఉత్పత్తి (పవర్ అవుట్‌పుట్) సుమారుగా 63 bhp వరకు ఉండనుంది. అయితే ఈ కారులో ప్రధానంగా శక్తి కాకుండా, ఈజీ డ్రైవింగ్ అనుభవం, ఉత్తమ మైలేజ్, తక్కువ ధర వంటి అంశాలే ముఖ్యమైనవి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వివరాలు 

కారులో ప్రత్యేకతలు: 

ఈ కారులోని క్యాబిన్ డిజైన్ చాలా సరళంగా ఉంటుంది. డాష్‌బోర్డ్‌లో ఫిజికల్ బటన్లు, రోటరీ డయల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే క్రింద ఒక చిన్న షెల్ఫ్ వంటి వాడుకకోసం అవసరమైన కంట్రోల్స్ ఉంటాయి. దీనిలో 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్లు ఉంటాయి. అవసరమైతే సీట్లను మడతపెట్టి బరువు గల లగేజీకి స్థలం కల్పించుకోవచ్చు. ఈ కారు ప్రత్యేకంగా తీసుకురావబడిన మరో ఫీచర్ వెహికల్-టు-లోడ్ టెక్నాలజీ. దీని సహాయంతో ఎలక్ట్రానిక్ పరికరాలను నేరుగా కార్ బ్యాటరీ నుంచి ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం ప్రత్యేక అడాప్టర్ అవసరం.

వివరాలు 

కారు రూపకల్పన: 

డిజైన్ విషయానికొస్తే, ఇది సూపర్ EV కాన్సెప్ట్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ, వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరళమైన, యూజర్ ఫ్రెండ్లీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కారు రూపం రెట్రో స్టైల్ బాక్సీ లుక్లో ఉంటుంది. అలాగే గుండ్రటి హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌లో కొద్దిగా వంకర తీరు, మూసివేసిన ఫ్రంట్ గ్రిల్, సజావుగా ఇన్‌స్టాల్ చేసిన ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఇందులో ఉంటాయి.

వివరాలు 

కారు పరిమాణం: 

ఈ కారు పొడవు సుమారుగా 3,400 మిల్లీమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని అప్‌రైట్ లుక్, చిన్న పరిమాణం, సాధారణ డిజైన్ వంటివి చాలా మందిని ఆకట్టుకునే అంశాలుగా మారనున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సరళమైన ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారికి ఇది ఒక ఉత్తమ ఎంపికగా నిలవనుంది.