Page Loader
టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది!
టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది!

టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

సరికొత్త ఎస్‌యూవీకి సంబందించిన కాన్సెప్ట్‌ను హోండా ప్రదర్శించనుంది. టోక్యో మోటార్ షో 2023లో భాగంగా అక్టోబర్ 26నుంచి నవంబర్ 6 వరకు జరిగే ఈవెంట్‌లో హోండా సరికొత్త ఎస్‌యూవీలను ప్రకటించనుంది. హైలైట్‌లలో హోండా స్పెషాలిటీ స్పోర్ట్స్ కాన్సెప్ట్ ను పరిచయం చేయనుంది. ఇది ప్రొడక్షన్-రెడీ EV స్పోర్ట్స్ కారు. ఈ కారు ఫోటోలను, టీజర్ లను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే ఈ ఈవెంట్‌లో SUSTANIA-C, POCKET, CI-MEV, అలాగే బ్యాటరీ-స్వాపింగ్ టెక్నాలజీతో కూడిన SC ఇ-స్కూటర్ కాన్సెప్ట్‌ లను లాంచ్ చేయనున్నారు. హోండా స్పెషాలిటీ స్పోర్ట్స్ కాన్సెప్ట్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. టోక్యో మోటార్ షో 2023లో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాన్సెప్ట్‌లలో ఇది ఒకటి.

Details

హోండా స్పెషాలిటీ స్పోర్ట్ కాన్సెప్ట్ భారీ అంచనాలు

గతంలో మోటార్ షో 2017 ఎడిషన్‌లో స్పోర్ట్స్ EV కాన్సెప్ట్‌ను ప్రదర్శించారు. అయితే ఆ కాన్సెప్ట్‌కు ఈ సంవత్సరం లాంచ్ చేసే దానితో ఏమైనా పొలికలు ఉన్నాయో లేదో వేచి చూడాల్సిందే. టోక్యో మోటార్ షో 2023లో, హోండా మూడు స్థిరమైన కాన్సెప్ట్‌లను ప్రదర్శించనుంది. SUSTANIA-C అనేది హోండా ఇ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. పట్టణవాసులకు గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్‌గా ఇది రానుంది. పాకెట్ ఇ-మోటార్‌సైకిల్ పునర్వినియోగపరచదగిన యాక్రిలిక్ రెసిన్ మెటీరియల్‌ని కలిగి ఉంటుంది. హోండా SC ఇ-స్కూటర్ కాన్సెప్ట్ బ్యాటరీ-స్వాపింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఇ యూనిట్ల ద్వారా శక్తిని పొందుతుంది. బ్యాటరీ ప్యాక్‌లను సులభంగా మార్చుకోవడానికి ఇది అనుమతిస్తుంది,