
Hyundai i10: విక్రయాల్లో కొత్త రికార్డు నెలకొల్పిన హ్యుందాయ్ ఐ10
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్‌కు చెందిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో కలిపి హ్యుందాయ్ ఐ10 మోడల్ 33 లక్షల యూనిట్లను విక్రయించింది.
ఇందులో భారతదేశం నుంచి 20 లక్షల వాహనాలను విక్రయించగా, మిగిలిన 13 లక్షల వాహనాలను దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ వంటి దేశాలకు ఎగుమతి చేసింది.
ఇలా భారత్‌ను వాహన ఎగుమతుల కేంద్రంగా మరింత బలోపేతం చేసుకున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, గ్లోబల్ మార్కెట్లలో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది.
Details
వినియోగదారులను సంతృప్తి పరిచడమే లక్ష్యం
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఉన్సూ కిమ్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రపంచ స్థాయి ప్రొడక్టులను తయారుచేసే సంస్థగా హ్యుందాయ్ ఎదుగుతుండటానికి ఈ మైలురాయి నిదర్శనమని ఆయన అన్నారు.
వినియోగదారుల సంతృప్తిని నిలబెట్టడంలో తమ దృఢ సంకల్పమే ఈ విజయానికి కారణమని చెప్పారు.
త్వరలో ప్రారంభమయ్యే మహారాష్ట్ర ప్లాంట్ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు కూడా వాహనాలను ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిమ్ తెలిపారు.
Details
18 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించిన హ్యుందాయ్
దీనివల్ల భారత్‌లో తయారీ రంగానికి మరింత మద్దతు లభించనుంది. హ్యుందాయ్ ఐ10 సుమారు 18 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
అప్పటి నుంచి ఐ10, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్ పేరిట మూడు జనరేషన్ వాహనాలను కంపెనీ పరిచయం చేసింది.
ప్రస్తుతం ఐ10 మోడల్ పెట్రోల్, పెట్రోల్ ఏఎంఎటి, సీఎన్‌జీ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
సాధారణంగా హ్యుందాయ్ భారతదేశంలో సగటున సంవత్సరానికి లక్ష ఐ10 వాహనాలను విక్రయిస్తోంది.