Page Loader
2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర, బుకింగ్స్ వివరాలివే!
హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర, బుకింగ్స్ వివరాలివే!

2023 Hyundai i20 : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర, బుకింగ్స్ వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2023
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆటో మొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా హ్యుందాయ్ ఐ20కి ఫేస్ లిస్ట్ వర్షెన్ తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్‌ను మార్కెట్ లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను తెలుసుకుందాం.ఫేస్ లిస్ట్ ప్రయాణికుల భద్రత కోసం హ్యుందాయ్ సంస్థ పెద్దపీట వేసింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, హిల్​ అసిస్ట్​ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ మేనేజ్​మెంట్​, యాంటీలాక్​ బ్రేకింగ్​ సిస్టెమ్​ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇక ఈ హ్యాచ్​బ్యాక్​ మోడల్​ కేబిన్​ డ్యూయెల్​ టోన్​ గ్రే- బ్లాక్​ కలర్‌లో​ వస్తోంది.

Details

హ్యందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ బుకింగ్స్ ప్రారంభం

ఈ మోడల్​లోని ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​లో 60కిపైగా కెనెక్టెడ్​ కార్​ ఫీచర్స్​, 127 ఎంబెడెడ్​ వీఆర్​ కమండ్స్​, ఒవర్​-ది-ఎయిర్​ అప్డేట్స్​, టైప్​-సీ ఛార్జర్​లు ఉండనున్నాయి. లెథరెట్​ డోర్​ ఆర్మ్​రెస్ట్స్​, లెథర్​ వ్రాప్​డ్​ డీ-కట్​ స్టీరింగ్​ వీల్​ వంటివి లభిస్తున్నాయి. ఈ హ్యాచ్​బ్యాక్​లో బంపర్​ను పూర్తిగా​ హ్యుందాయ్​ సంస్థ రీడిజైన్ చేసింది. ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్స్​తో పాటు ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, 16ఇంచ్​ అలాయ్​ వీల్స్​ కొత్తగా ఉన్నాయి. ఈ హ్యందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ఎక్స్​షోరూం ధర రూ. 6.99లక్షల నుంచి రూ. 11.1లక్షల మధ్యలో ఉండనుంది. ఇప్పటికే ఈ వెహికల్‌కు సంబంధించి బుకింగ్స్​ ఓపెన్​ ప్రారంభమయ్యాయి.