Page Loader
Hyundai EXTER: బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!
బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!

Hyundai EXTER: బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 20, 2023
05:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ ఎక్స్ టర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మార్కెట్లో ఈ వాహనానికి వీపరితమైన డిమాండ్ ఏర్పడింది. లాంచ్ అయిన నాలుగు నెలల్లోనే లక్ష బుకింగ్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఈ వెహికల్ డిజైన్, ఫీచర్స్ ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు ఈ మోడల్‌పై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. భారత మార్కెట్లో 2023 జులైలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ అయింది. ఈ వెహికల్ ఎక్స్ షో రూం ధర రూ. 6లక్షల నుండి రూ.10.5 లక్షల మధ్యలో ఉంది. ఈ మోడల్‌లో కూడా 7 వేరియంట్లు ఉన్నారు. ఇక హ్యాచ్‌బ్యాక్ ధరకే దాదాపు అన్ని ఫీచర్స్‌తో కూడిన కాంపాక్ట్‌ని ఈ ఎస్‌యూవీ ఆఫర్ చేస్తోంది. ఇందులో హై ఎండ్ మోడల్స్‌లో క్రేజీ ఫీచర్స్ ఉన్నాయి.

Details

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ అధునాతన ఫీచర్లు

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 6 ఎయిర్ బ్యాగులు, డ్యూయెల్ వ్యూ-డాష్ కెమరా, స్మార్ట్ ఎలక్ట్రిక్ సనరూఫ్, వయర్ లెస్ ఛార్జింగ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇది 82 హెచ్‌పీ పవర్‌ని, 95 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 1.2లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఎక్స్​టర్​ మైలేజ్​ 19.2 కేఎంపీఎల్​గా ఉండటం విశేషం. ఈ 5 సీటర్​ మైక్రో ఎస్​యూవీ కేబిన్​లో సెమీ లెథరేట్​ అప్​హోలిస్ట్రీ, ఎక్స్​టర్​ లెటర్స్​ ఉండే హెడ్​రెస్ట్​లు, 3 స్పోక్​ మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​ వంటివి వస్తున్నాయి. ఈ ఎక్స్‌టర్‌కి వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. ఎస్​, ఎస్​(ఓ), ఎస్​ఎక్స్​(ఓ)కనెక్ట్​, ఎస్​ఎక్స్​(ఓ) ఏఎంటీ,ఎస్​ఎక్స్​(ఓ) కనెక్ట్​ ఏంటీ వేరియంట్​ల డెలివరీలకు గరిష్ఠంగా 8 నెలల సమయం పట్టడం గమనార్హం.