Ford Endeavour vs Toyota Fortuner: ఫోర్డ్, టయోటా కార్లలో ఏది బెటర్?
టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్.. త్వరలో కొత్త తరం ఫోర్డ్ ఎండీవర్ (ఎవరెస్ట్)తో భారత ఆటోమోటివ్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. పూర్తస్థాయి SUVతో పాటు ప్రత్యేక డిజైన్, పవర్‌ట్రెయిన్ వంటి కామన్ ఫీచర్లు ఉన్న ఈ రెండు కార్లలో ఏది బెటర్ అనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి. ఎస్‌యూవీల పరంగా భారతదేశంలోని ప్రముఖ ఆటోమేకర్లలో టయోటా ఒకటి. ఈ కంపెనీకి చెందిన సెవెన్-సీటర్ ఫార్చ్యూనర్‌కు దేశంలో విశేషమైన ఆదరణ ఉంది. ఇదే ప్రస్తుతం అగ్రగామిగా ఉంది. ఫార్చ్యూనర్ పోటీగా అధునాతన ఫీచర్లతో ఫోర్డ్ ఎండీవర్ (ఎవరెస్ట్)ను ఇదే కేటగిరీలో గ్రాండ్ రీ-ఎంట్రీ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
బుచ్ డిజైన్‌తో మరింత ఆకర్షణీయంగా ఫోర్డ్ ఎండీవర్
ఫోర్డ్ ఎండీవర్ బుచ్ డిజైన్‌తో మరింత ఆకర్షణీయంగా తయారు చేశారు. ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను సీ-ఆకారపు డీఆర్ఎల్‌లు దీని ప్రత్యేకతలు. అలాగే ఒక పెద్ద గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఈ కారు సొంతం. అయితే టయోటా ఫార్చ్యూనర్‌కు మాత్రం పొడవాటి, మస్క్యులర్ హుడ్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎస్‌లతో పాటు స్వెప్ట్-బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సైడ్-స్టెప్పర్, 17/18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఈ రెండు ఎస్‌యూవీ వాహనాల్లోనూ రూఫ్ పట్టాలు, షార్క్-ఫిన్ యాంటెన్నాను కలిగి ఉంటాయి.
ఖరీదైన క్యాబిన్ పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఎండీవర్ సొంతం
ఎండీవర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, 12-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, 12.4-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి. ఫార్చ్యూనర్ సెవెన్-సీటర్ క్యాబిన్‌లో మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కన్సోల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ప్రీమియం జేబీఎల్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. భారతదేశంలో టయోటా ఫార్చ్యూనర్ ధరలు రూ. రూ. 33.43 లక్షలు నుంచి రూ. 51.44 లక్షల మధ్యలో ఉన్నాయి. మరోవైపు, ఫోర్డ్ ఎండీవర్ ప్రారంభ ధర రూ. 35 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).