Loading...
Electric Two-Wheeler Sales: 2026లో ఈవీ స్కూటర్ల హవా.. 9 నెలల్లోనే 15.61 లక్షల వాహనాల అమ్మకాలు
2026లో ఈవీ స్కూటర్ల హవా.. 9 నెలల్లోనే 15.61 లక్షల వాహనాల అమ్మకాలు

Electric Two-Wheeler Sales: 2026లో ఈవీ స్కూటర్ల హవా.. 9 నెలల్లోనే 15.61 లక్షల వాహనాల అమ్మకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ మార్కెట్‌ 2026లో దూసుకెళ్తోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే అమ్మకాలు భారీ స్థాయికి చేరాయి. వాహన్‌ పోర్టల్‌ గణాంకాల ప్రకారం.. జనవరి నుంచి సెప్టెంబర్‌ 2026 మధ్య దేశవ్యాప్తంగా 15.61 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. ఈ వృద్ధిలో టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో, ఏథర్‌ ఎనర్జీ, హీరో మోటోకార్ప్‌ కీలకంగా నిలిచాయి. మొత్తం ఈవీ టూ వీలర్‌ విక్రయాల్లో ఈ నాలుగు సంస్థల వాటానే 76 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి ఈవీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2025 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 9.61 లక్షల ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

వివరాలు 

తొమ్మిది నెలల్లో 15.61 లక్షల యూనిట్లు 

ఈ ఏడాది అదే తొమ్మిది నెలల్లో 15.61 లక్షల యూనిట్లకు చేరడంతో సుమారు 6 లక్షల వాహనాలు అదనంగా విక్రయమైనట్లు తెలుస్తోంది.

అంటే ఏడాది ప్రాతిపదికన 62 శాతానికి పైగా వృద్ధి నమోదైంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 2025 పూర్తి సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 13.42 లక్షల ఎలక్ట్రిక్‌ టూ వీలర్లు అమ్ముడయ్యాయి.

అయితే 2026లో కేవలం తొమ్మిది నెలల్లోనే ఆ సంఖ్యను అధిగమించింది.

గత ఏడాది మొత్తం అమ్మకాల కంటే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే 2.19 లక్షల యూనిట్లు ఎక్కువగా విక్రయమయ్యాయి.

దీంతో భారత ఈవీ ద్విచక్ర వాహన విభాగంలో డిమాండ్‌ ఏ స్థాయిలో పెరుగుతోందో అర్థమవుతోంది.

వివరాలు 

టీవీఎస్‌, బజాజ్‌ ముందంజ

సెప్టెంబర్‌ నెలలో కూడా అమ్మకాలు జోరుగా సాగాయి. ఆ నెలలో దేశవ్యాప్తంగా 1.97లక్షల ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

ఆగస్టులో నమోదైన సంఖ్యతో పోలిస్తే ఇది 7.7శాతం ఎక్కువ.

2026లో మరో మూడు నెలలు మిగిలి ఉండటంతో.. ఈ కాలంలో నమోదయ్యే ప్రతి కొత్త విక్రయం వార్షిక ఈవీ మార్కెట్‌ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది.

ప్రస్తుతం దేశీయ ఈవీ మార్కెట్‌లో టీవీఎస్‌,బజాజ్‌ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

టీవీఎస్‌ ఐక్యూబ్‌ (iQube)కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

మరోవైపు బజాజ్‌ చేతక్‌ (Chetak)సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా నిలిచింది.

ఈ రెండు మోడళ్లతో పాటు ఏథర్‌ ఎనర్జీ రిజ్టా (Rizta),హీరో మోటోకార్ప్‌కు చెందిన విడా(Vida)కూడా విక్రయాల్లో ముందంజలో ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

టీవీఎస్‌, బజాజ్‌ ముందంజ

అయితే సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి సంబంధించిన ఈ మోడళ్ల పూర్తి అధికారిక విక్రయ గణాంకాలు ఇంకా వెల్లడికాలేదు.

అయినప్పటికీ ఇప్పటివరకు కనిపిస్తున్న విక్రయ ధోరణి ఈ స్కూటర్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను స్పష్టం చేస్తోంది.

ముఖ్యంగా టాప్‌ కంపెనీల మోడళ్లకు వస్తున్న స్పందనతో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగంలో పోటీ మరింత పెరుగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

చిన్న కంపెనీలూ వెనుకబడటం లేదు

ఈవీ మార్కెట్‌లో పెద్ద సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. చిన్న తయారీదారులు కూడా తమ వాటాను పెంచుకుంటున్నారు.

దీనికి రివర్‌ మొబిలిటీ (River Mobility) ఒక ఉదాహరణ. 2025లో ఈ సంస్థకు ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ మార్కెట్లో 1.27శాతం వాటా ఉండగా.. 2026లో అది 2.46శాతానికి పెరిగింది.

అంటే మార్కెట్‌ వాటా దాదాపు రెట్టింపు అయింది. మొత్తంగా చూస్తే భారత ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ విభాగం వేగంగా విస్తరిస్తోంది.

వివరాలు 

చిన్న కంపెనీలూ వెనుకబడటం లేదు

2025 పూర్తి ఏడాది విక్రయాల రికార్డును 2026 తొలి తొమ్మిది నెలల్లోనే అధిగమించడం ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు సంకేతంగా కనిపిస్తోంది.

టీవీఎస్‌, బజాజ్‌, ఏథర్‌, హీరో వంటి ప్రముఖ సంస్థలతో పాటు చిన్న కంపెనీలు కూడా మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుండటంతో.. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ విభాగంలో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT