MATTER AERA 5000+: భారత్‌లో తొలి గియర్డ్ ఎలక్ట్రిక్ బైక్ AERA 5000+.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ కంపెనీ MATTER Motor Works తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ AERA 5000+ను చెన్నైలో ఘనంగా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమం సందర్భంగా తమిళనాడులో మొదటి MATTER Experience Hub కూడా ప్రారంభించారు. AERA 5000+ ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇండియాలో మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న తొలి ఎలక్ట్రిక్ బైక్ కావడం. బైక్ ప్రేమికులలో ఇప్పటికే భారీ ఆసక్తి ఏర్పడింది. భారత రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈ బైక్ 100శాతం దేశీయ రూపకల్పనతో రూపొందించారు.
Details
HyperShift 4-స్పీడ్ మాన్యువల్ గియర్‌బాక్స్
MATTER ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన HyperShift 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఈ బైక్‌లో ఉన్నాయి. ఇది సైలెంట్ టార్క్, స్మూత్ పవర్ డెలివరీకు మాన్యువల్ షిఫ్ట్ అనుభూతిని జోడిస్తుంది. అదనంగా లిక్విడ్ కూల్డ్ పవర్ ట్రెయిన్ వల్ల చెన్నై వంటి వేడి వాతావరణంలో కూడా స్థిరమైన పనితీరును అందిస్తుంది. రైడ్ మోడ్‌లు, రేంజ్ AERA 5000+ లో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. 5 kWh బ్యాటరీతో 172 కి.మీ. IDC రేంజ్ పొందవచ్చు.
Details
స్మార్ట్ ఫీచర్లు
7 అంగుళాల స్మార్ట్ టచ్ స్క్రీన్ డాష్‌బోర్డ్ : నావిగేషన్, మ్యూజిక్, రైడ్ డేటా, OTA అప్డేట్స్. స్మార్ట్ ఛార్జింగ్ సదుపాయం : దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లు. సేఫ్టీ ఫీచర్లు : డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ABS, డ్యూయల్ సస్పెన్షన్. MatterVerse మొబైల్ యాప్ : లైవ్ ట్రాకింగ్, రిమోట్ లాక్/అన్‌లాక్. కీ-less స్టార్ట్ సౌకర్యం. కోస్ట్, సేవింగ్స్ కిలోమీటరుకు కేవలం రూ.0.25 ఖర్చు, మూడు సంవత్సరాల్లో ఒక లక్ష కి.మీ సేవింగ్స్ సాధ్యమని కంపెనీ తెలిపింది. లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ - ఇండియాలో మొదటి సారి.
Details
పవర్‌ట్రెయిన్, మోటార్, గేర్‌బాక్స్ స్పెసిఫికేషన్లు
టాప్ స్పీడ్: 105 km/h రియల్ రేంజ్: 125 km 11.5 kW IPMSM మోటార్ 4-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ABS బ్రేక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ షాక్ రియర్ సస్పెన్షన్ 4G LTE, Wi-Fi, BLE, GPS, OTA Updates
Details
బుకింగ్స్, ధరలు
AERA 5000+ బుకింగ్స్ MATTER అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. ఇంట్రోడక్టరీ ఎక్స్‌షోరూమ్ ధర: రూ.1,93,826 అందుబాటులో రంగులు: కాస్మిక్ బ్లాక్, కాస్మిక్ బ్లూ, గ్లేసియర్ వైట్, బ్లెజ్ రెడ్, నోర్డ్ గ్రే చెన్నై పెరుంబక్కం MATTER Experience Hub లో బైక్‌ను ప్రత్యక్షంగా చూడొచ్చు. మొత్తం చెప్పాలంటే AERA 5000+ ప్రత్యేక పవర్‌ట్రెయిన్, మాన్యువల్ గియర్ అనుభూతి, అధునిక స్మార్ట్ ఫీచర్లు, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీతో భారత ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది.