NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / toll plazas collection: 5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్‌ ట్యాక్స్‌ : ప్రభుత్వ డేటా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    toll plazas collection: 5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్‌ ట్యాక్స్‌ : ప్రభుత్వ డేటా
    5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్‌ ట్యాక్స్‌ : ప్రభుత్వ డేటా

    toll plazas collection: 5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్‌ ట్యాక్స్‌ : ప్రభుత్వ డేటా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల నుంచి గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎంత టోల్ వసూలు చేసిందో తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు.

    అక్షరాలా రూ.1.93 లక్షల కోట్లు టోల్‌ ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాయి.

    ఈ వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) లోక్‌సభలో వెల్లడించింది.

    ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం,దేశంలోనే అత్యధిక టోల్ ట్యాక్స్ వసూలు చేసిన ప్లాజా గుజరాత్‌లోని ఎన్‌హెచ్‌-48లో వడోదర-భరూచ్ విభాగంలో ఉంది.

    2019-20 నుంచి 2023-24 వరకు ఐదేళ్లలో ఈ ప్లాజా రూ.2,043.81 కోట్ల టోల్ వసూలు చేసింది.

    టోల్ ఆదాయాల జాబితాలో రెండో స్థానంలో రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా నిలిచింది.

    వివరాలు 

    నాలుగో స్థానంలోబారజోధ టోల్ ప్లాజా

    ఇది ఎన్‌హెచ్‌-48లో గుర్గావ్-కోట్‌పుట్లి-జైపూర్ మార్గంలో ఉంది. ఈ ప్లాజా గత ఐదేళ్లలో రూ.1,884.46 కోట్ల టోల్ వసూలు చేసినట్లు మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.

    మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా ఉంది. 2019-20 నుండి 2023-24 వరకు ఈ ప్లాజా రూ.1,538.91 కోట్ల టోల్ వసూలు చేసింది.

    ఉత్తరప్రదేశ్‌లోని బారజోధ టోల్ ప్లాజా ఐదేళ్లలో రూ.1,480.75 కోట్ల టోల్ వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా 1,063 టోల్ ప్లాజాలు

    దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం తెచ్చిన టాప్-10 టోల్ ప్లాజాల జాబితాలో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రెండు ప్లాజాలు ఉండగా, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌ల నుంచి ఒక్కో ప్లాజా చొప్పున ఉన్నాయి.

    ఈ టాప్-10 టోల్ ప్లాజాలు కలిపి గత ఐదేళ్లలో రూ.13,988.51 కోట్ల టోల్ వసూలు చేశాయి.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ

    తాజా

    WTC Final: WTC ఫైనల్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కామెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి.. ఆస్ట్రేలియా
    Jupiter: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ బృహస్పతిపై.. వందల రెట్ల కాంతి (వీడియో)  సైన్స్ అండ్ టెక్నాలజీ
    Stock Market : నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 900 పాయింట్లు డౌన్‌  స్టాక్ మార్కెట్
    CREA Report: కాలుష్యంలో కొత్త రికార్డును బద్దలు కొట్టిన ఢిల్లీ.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..? దిల్లీ

    లోక్‌సభ

    Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ  పశ్చిమ బెంగాల్
    Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ  కాంగ్రెస్
    Manohar Lal Khattar: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా  మనోహర్ లాల్ ఖట్టర్
    Lok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల  ఎన్నికల సంఘం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025