Page Loader
2024 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ కెట్రా.. ఈ రెండిట్లో ఏ కారు మంచిది?
2024 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ కెట్రా.. ఈ రెండిట్లో ఏ కారు మంచిది?

2024 రెనాల్ట్ డస్టర్ వర్సెస్ హ్యుందాయ్ కెట్రా.. ఈ రెండిట్లో ఏ కారు మంచిది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 30, 2023
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

నెక్ట్స్ జనరేషన్ డస్టర్‌ని రివీల్ చేసేందుకు దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ఈ మోడల్‌ని రివీల్ చేశారు. ఈ వెహికల్‌కి పోటీగా హ్యుందాయ్ కెట్రా నిలిచింది. హ్యుందాయ్ క్రెటా ఇప్పటికీ వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్ వంటి వాటిపై ఆధిపత్యం చెలాయిస్తోంది. తాజాగా రెనాల్ట్ 2024 డస్టర్‌తో పోటీగా నిలిచింది. ఈ రెండిట్లో ఈ ఏ కారులో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. రెనాల్ట్ డస్టర్‌లో మస్కులర్ బానెట్, DRLలతో కూడిన సొగసైన LED హెడ్‌ల్యాంప్‌లు, స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రెయిల్‌లు, అల్లాయ్ వీల్స్, Y-ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.

Details

ఈ రెండు ఎస్‌యూవీలో మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్స్

హ్యుందాయ్ క్రెటాలో స్ప్లిట్-టైప్ DRLలతో కూడిన ట్రిపుల్ LED హెడ్‌లైట్లు, సిల్వర్డ్ రూఫ్ రైల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, డైమండ్-కట్ వీల్స్ LED టెయిల్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డస్టర్‌లో ఐదు-సీట్ల క్యాబిన్‌తో కనిపించే డ్యాష్‌బోర్డ్, ప్రీమియం ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రీ-స్టాండింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. CRETAలో బ్లాక్డ్-అవుట్ డాష్‌బోర్డ్, ఆటోమేటిక్ AC, లెదర్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, 10.24-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఐదు-సీట్ల క్యాబిన్ ఉంది. ఈరెండు SUVలు మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటాయి. కెట్రాలో రూ. 10.87 లక్షలు నుండి రూ. 19.2 లక్షలు ఉండగా, రెనాల్ట్ డస్టర్ ఇంకా ధరను వెల్లడించలేదు.