Page Loader
Electric two-wheelers: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని ఎత్తేసారా? ముగియనున్న ఫేమ్-2 గడువు
ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని ఎత్తేసారా? ముగియనున్న ఫేమ్-2 గడువు

Electric two-wheelers: ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని ఎత్తేసారా? ముగియనున్న ఫేమ్-2 గడువు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2023
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం బాగా పెరిగింది. కొత్తగా టూవీలర్లు కొనేవారు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలు అనేకం పుట్టుకొచ్చాయి. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 'ఫేమ్' (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌) అనే పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం మొదటి విడత ఇప్పటికే పూర్తి కాగా, రెండో విడత ముగింపు దశకు వచ్చింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం మరికొన్ని వారాల్లో ఎత్తివేస్తుందని ప్రచారం సాగుతోంది.

Details

ముగింపు దశకు ఫేమ్ 2 పథకం

ఎందుకంటే స్కీమ్ మూడో విడత (ఫేమ్-3) తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. ఫేమ్-1కు కొనసాగింపుగా ఫేమ్ 2 ఫథకాన్ని 2019లో కేంద్రంలో తీసుకొచ్చింది. ఇందులో భాగంగా టూవీలర్, త్రీవిలర్, ఫోర్ వీలర్ కొనుగోళ్లపై సబ్సిడిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. గతంలో ఒక కిలోవాట్‌కు కేంద్రం సబ్సిడి ఇచ్చింది. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.10వేలకు కుదించింది. ఈ పథకం 2024 మార్చి 31తో ముగియనుంది. దీన్ని పొడగించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ప్రతిపాదిస్తుండగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ విముఖత చూపుతున్నట్లు సమాచారం.