Page Loader
Jawa 42 Bobber బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ విడుదల.. ఇంజిన్‌లో మార్పులు!
బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ విడుదల.. ఇంజిన్‌లో మార్పులు!

Jawa 42 Bobber బ్లాక్‌ మిర్రర్‌ బైక్‌ విడుదల.. ఇంజిన్‌లో మార్పులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2023
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా మోటర్ సైకిల్స్ కొత్త Jawa 42 Bobber బైక్ టాప్ ఎండ్ వెర్షెన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త జావా 42 బ్లాక్ మిర్రర్ బైక్ ధర రూ.2.25 లక్షలుగా ఉంది. ఇప్పటికే ఈ బైక్స్ సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కొత్త బైకులో ఇంజిన్ కొన్ని మార్పులు చేయగా, డిజైన్‌లో ఎటువంటి మార్పులను చేయలేదు. ఈ బైక్ అల్లాయ్స్ వీల్స్ తో పాటు డ్యూయల్‌ టోన్‌ ఫినిషింగ్‌తో ట్యూబ్ లెస్‌ టైర్లతో వస్తోంది. బైక్ గేర్లు, ఇంజిన్ కవర్లను రీడిజైన్ చేశారు. ఇక ఈ బైక్ సైడ్ ప్యానల్ నలుపు రంగులో ఉండగా, 42 బాబర్ బ్యాడ్జ్‌ను కలిగి ఉంది.

Details

జావా 41 బాబర్ బ్లాక్ మిర్రర్ బైక్ లో ఛార్జింగ్‌ పోర్టు, ఎల్ఈడీ లైట్లు

జావా 41 బాబర్ బ్లాక్ మిర్రర్ బైక్ ఇంజిన్ 29.49bhp, 32.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో ఇది వస్తుంది. ఇక బ్లాక్ మిర్రర్ బైకులో మెకానికల్ గా కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. అలాగే rpmను 1500 నుంచి 1350 rpm కి తగ్గించింది స్పోక్‌ వీల్స్‌తో పాటు అల్లాయ్‌ వీల్స్‌ ట్యూబ్‌లెస్‌ టైర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఇంజిన్‌ లేఅవుట్‌లో థెరెటల్‌ బాడీలు 33ఎంఎం నుంచి 38ఎంఎంకి పెంచారు. ఈ బైక్‌ అడ్జస్టబుల్‌ సీట్‌, ఛార్జింగ్‌ పోర్టు, డిజిటల్ కన్సోల్‌, LED లైట్లు ఉండడం విశేషం.