Suzuki Jimny: జపాన్‌లో జిమ్నీ 5డోర్ సంచలనం.. బుకింగ్స్ నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్‌లో ఇటీవల ప్రారంభించిన జిమ్నీ 5డోర్ వేరియంట్ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది.
జపాన్‌లో జనవరి 30న ఈ ఎస్‌యూవీ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ఏప్రిల్ 3 నుంచి డెలివరీలు అందిస్తామని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ మోడల్‌కు అక్కడి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
కేవలం నాలుగు రోజుల్లోనే 50వేల బుకింగ్‌లు నమోదయ్యాయి.
పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోవడంతో పాటు వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోవడంతో, బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మారుతీ ప్రకటించింది.
అయితే తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనేది వెల్లడించలేదు.
Details
బుకింగ్స్ కు భారీ డిమాండ్
జపాన్‌లో మారుతీ జిమ్నీ 5డోర్ మోడల్ స్పీడ్ మాన్యువల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.14.88 లక్షలు కాగా, ఆటోమేటిక్ వెర్షన్ ధర రూ.15.43 లక్షలు.
భారత్‌లో వరుసగా రూ.12.74 లక్షలు, ₹14.79 లక్షలుగా ఉన్నాయి.
మహీంద్రా థార్ రాక్స్, ఫోర్స్ గుర్ఖా వంటి 5డోర్ ఎస్‌యూవీలకు ఇది గట్టిపోటీ ఇస్తోంది. ఈ జిమ్నీ 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 105 హెచ్‌పీ పవర్, 134 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను కలిగి ఉంది. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 16.94 కి.మీ., ఆటోమేటిక్ వేరియంట్ 16.39 కి.మీ. మైలేజ్‌ను అందించనుంది.
ఈ 5డోర్ ఎస్‌యూవీ 210 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తోంది.