Page Loader
Kawasaki Ninja ZX-6R: జనవరి 1న ఇండియన్ మార్కెట్లోకి నింజా ZX-6R లాంచ్
జనవరి 1న ఇండియన్ మార్కెట్లోకి నింజా ZX-6R లాంచ్

Kawasaki Ninja ZX-6R: జనవరి 1న ఇండియన్ మార్కెట్లోకి నింజా ZX-6R లాంచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2023
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచ్రక వాహనాల తయారీ సంస్థ కవాసకి ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. అధిక పనితీరుతో పాటు అనువైన బడ్జెట్‌లో ఈ కంపెనీ బైక్ లు అందుబాటులో ఉంటాయి. తాజాగా కవాసకి నింజా ZX-6Rను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఇండియన్ మార్కెట్లోకి జనవరి 1న ZX-6Rలాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ZX-6R నూతన అప్‌గ్రేడ్‌లతో, సరికొత్త ఇంజన్‌ను కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూం ధర దాదాపుగా రూ. 11 లక్షలు ఉండనుంది. ఈ బైక్ 636cc, లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌తో నడుస్తుంది.

Details

నింజా ZX-6Rలో అధునాతన ఫీచర్లు

నింజా ZX-6Rలో క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, LED లైట్లు ఉన్నాయి. ఈ బైక్ 13,000rpm వద్ద 129hp గరిష్ట శక్తిని, 10,800rpm వద్ద 69Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్, క్విక్-షిఫ్టర్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. TFT ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ రైడాలజీ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని అందిస్తుంది. ముందువైపు డ్యూయల్ 310ఎమ్ఎమ్ డిస్క్‌లు, వెనుకవైపు ఒకే 220ఎమ్ఎమ్ డిస్క్‌లను అమర్చారు.