Loading...
Kejriwal: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగన్ ఆర్ స్టోరీ!
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగన్ ఆర్ స్టోరీ!

Kejriwal: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగన్ ఆర్ స్టోరీ!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అదే ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత గుర్తింపు తెచ్చిన బ్లూ కలర్ మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు. తాజాగా ప్రముఖ యూట్యూబర్ సార్థక్ గోస్వామి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కేజ్రీవాల్.. ఈ కారుతో తనకున్న అనుబంధం, దాని గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దీంతో ఈ కారు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రాజకీయ నాయకులు అంటేనే ఖరీదైన దుస్తులు, భారీ లగ్జరీ ఎస్‌యూవీలు గుర్తుకొస్తాయి. కానీ అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించేవారు.

వివరాలు

సీఎం పదవిలో ఉన్న షీలా దీక్షిత్‌పై పోటీ..

సాదాసీదా దుస్తులతో పాటు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వ్యాగన్ ఆర్ కారులోనే ఆయన తిరిగేవారు.

ఆ కారు కేజ్రీవాల్ రాజకీయ జీవితంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ముఖ్యంగా 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ కారు ఆయన ప్రచారంలో కీలకంగా మారింది.

ఆ ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది.

2013 ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ ఇదే బ్లూ కలర్ వ్యాగన్ ఆర్ కారులో ప్రచారం చేశారు.

అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి, మూడుసార్లు సీఎం పదవిలో ఉన్న షీలా దీక్షిత్‌పై పోటీ చేసిన కేజ్రీవాల్.. 22 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

వివరాలు

మరోసారి ట్రెండింగ్‌లోకి వ్యాగన్ ఆర్..

కేజ్రీవాల్‌తో పాటు ఆయన ప్రచారానికి ఉపయోగించిన ఈ కారుపైనా భారీగా ఆసక్తి పెరిగింది.

అప్పట్లో సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాగన్ ఆర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

తాజాగా అరవింద్ కేజ్రీవాల్‌తో సార్థక్ గోస్వామి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఈ కారు ప్రస్తావన రావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

పాడ్‌కాస్ట్‌లో భాగంగా సార్థక్.. ''మీ వ్యాగన్ ఆర్ కారు ఏమైంది?'' అని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు.

దీనికి ఆయన సరదాగా సమాధానం ఇచ్చారు. తమ మొదటి ఎన్నికల తర్వాత కూడా కొంతకాలం అదే కారును ఉపయోగించామని తెలిపారు.

అయితే కాలక్రమేణా కారు పాతబడిపోయి, వినియోగానికి పనికిరాకుండా పోయిందని కేజ్రీవాల్ చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు

ఆ వ్యాగన్ ఆర్ ప్రత్యేకతలు ఇవే..

2015లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తాను అధికారిక వాహనాన్ని ఉపయోగించడం ప్రారంభించానని తెలిపారు.

ఆ తర్వాత ఆ వ్యాగన్ ఆర్ కారును పార్టీకి చెందిన నాయకులు అధికారిక పనుల కోసం ఉపయోగించారని వివరించారు.

కేజ్రీవాల్ ఉపయోగించిన ఈ వ్యాగన్ ఆర్ 2005 మోడల్‌కు చెందినది.

అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన ఓ వ్యక్తి ఈ మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారును పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.

ఈ కారులో 1.1 లీటర్ F10D నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ఇది 64 bhp పవర్, 84 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేది.

కారు లీటర్‌కు సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇచ్చేది.

ADVERTISEMENT