Page Loader
బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు
బడ్జెట్ లో గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టిన ప్రభుత్వం

బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 01, 2023
06:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ 2023ని సమర్పించారు ఇందులో ఆటోమొబైల్ పరిశ్రమకు అనేక రాయితీలను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, ప్రభుత్వ వాహనాలను రద్దు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా తయారు చేయడం వరకు ఆటోమొబైల్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు. కార్లు, అంబులెన్స్‌లతో సహా పాత ప్రభుత్వ వాహనాలను కొత్త వాటికి అనుకూలంగా స్క్రాప్ చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తన సహాయాన్ని అందజేస్తుందని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.ఇది వాహనాల వల్ల ఏర్పడే వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

బడ్జెట్

లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన వాటిపై విధించిన కస్టమ్స్ సుంకం రద్దు చేసిన ప్రభుత్వం

ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కోసం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు రూ. 19,700 కోట్లు కేటాయించింది. వచ్చే ఐదేళ్లలో ఈ ఉత్పత్తి సామర్థ్యం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ఉండాలి. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన వాటిపై విధించిన కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం రద్దు చేస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలలో లిథియం-అయాన్ బ్యాటరీ అత్యంత అవసరం,ఎక్కువ లోకలైజ్డ్ కాంపోనెంట్స్ ఉన్న వాహనాలు మార్కెట్‌లోకి రావడంతో, ధరలు తగ్గుతాయి. డీనాట్ చేసిన ఇథైల్ ఆల్కహాల్‌పై ఇకపై కస్టమ్స్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 2023 నుండి అన్ని కార్లలో ఇథనాల్-మెటీరియల్ కంప్లైంట్‌ ఉండాలి. రవాణా మౌలిక సదుపాయాలకు సంబంధించి రూ. 100 ప్రాజెక్టులకు 75,000 కోట్లు మంజూరు చేశారు.