
Kia Carens Clavis EV: రేపే 'కియా క్యారెన్స్ క్లావిస్ EV' లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కియా మోటార్స్ భారతీయ ఈవీ మార్కెట్లో తన కుదురుగా కాలి ముద్ర వేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా కంపెనీ క్యారెన్స్ క్లావిస్ EV పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును జూలై 15న భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది కియా నుండి లాంచ్ అవుతున్న తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ కావడం విశేషం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కారులో స్టైల్, స్పేస్, టెక్నాలజీ సమ్మేళనం కనిపించనుంది. దీనిలో లభించే ఫీచర్లను, స్పెసిఫికేషన్లను ఓసారి పరిశీలిద్దాం.
Details
డిజైన్ హైలైట్స్
క్యారెన్స్ క్లావిస్ ఈవీ సాధారణ క్యారెన్స్ ఎంపీవీ తరహా శరీరాకృతి (సిల్హౌట్)ను అనుసరిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ వర్షన్‌గా ఉండటం వల్ల కొన్ని ప్రత్యేక డిజైన్ మార్పులున్నాయి ముందు భాగంలో క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో కూడిన ఛార్జింగ్ పోర్ట్ వెనుక భాగంలో కనెక్టెడ్ LED లైట్ బార్ ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, ప్రత్యేక బంపర్ల డిజైన్ ఈ మార్పులు దీన్ని పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ల నుంచి స్పష్టంగా వేరు చేస్తాయి.
Details
అంతర్గత ఫీచర్లు
కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీలో హైటెక్, భద్రతతో కూడిన అనేక ఫీచర్లు లభించే అవకాశముంది డ్యూయల్ 12.3-అంగుళాల కనెక్టెడ్ డిస్‌ప్లేలు రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ డ్యూయల్-టోన్ బ్లాక్ & వైట్ ఇంటీరియర్ థీమ్ కొత్త లోయర్ కన్సోల్, EV స్పెసిఫిక్ ఇంటర్‌ఫేస్ సౌకర్యానికి సంబంధించి పవర్డ్ & వెంటిలేటెడ్ డ్రైవర్ సీటు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ముందు-వెనుక వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆటో డిమ్మింగ్ IRVM
Details
భద్రతా ఫీచర్లు
6 ఎయిర్‌బ్యాగ్‌లు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ 360 డిగ్రీ కెమెరా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు అడ్వాన్స్డ్ లెవెల్-2 ADAS ఫీచర్లు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లేన్ కీప్ అసిస్టెంట్ డ్రైవర్ అటెన్షన్ అలర్ట్ ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
Details
అంచనాల స్పెసిఫికేషన్లు
51.4 kWh బ్యాటరీ ప్యాక్ - సుమారు 490 కిమీ రేంజ్ 42 kWh వేరియంట్ - సుమారు 400 కిమీ రేంజ్ AC/DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధర & పోటీ కియా క్యారెన్స్ క్లావిస్ EV ప్రారంభ ధర రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చని అంచనా. ఇది 7-సీటర్ EV ఎంపీవీ సెగ్మెంట్‌లో ప్రత్యక్షంగా పోటీ లేని మోడల్. అయితే పరోక్షంగా టాటా కర్వ్ EV, ఎంజీ ZS EV, హ్యుందాయ్ క్రెటా EV, మహీంద్రా BE.6, మారుతీ E-విటారా వంటి 5-సీటర్ ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడుతుంది. కియా క్యారెన్స్ క్లావిస్ EV ఫ్యామిలీ క్యార్ల కోసం ఎదురుచూస్తున్న ఈవీ వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన ఎంపికగా మారనుంది.